Rajamouli: వారణాసి లో డబ్బింగ్ కళాకారుల కోసం కసరత్తు చేసిన రాజమౌళి
Updated: Mon, 24 Aug 2026 (19:58 IST)
Mahesh Babu, Priyanka Chopra
ఎస్.ఎస్. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం వారణాసి. ఈ సినిమా అప్ డేట్ ను రకరకాలుగా తెలియజేస్తున్నారు. తాజాగా పలు భాషల్లో విడుదల చేసేందుకు ఆర్టిస్టులకు సహజమైన వాయిస్ కోసం దాదాపు. ప్రపంచవ్యాప్తంగా 1,500 మంది డబ్బింగ్ కళాకారుల గొంతులను పరిశీలించి తగిన నటీనటులను ఎంపిక చేయనున్నారు. తెలుగు, హిందీ, తమిళంతో పాటు జపనీస్, ఫ్రెంచ్, స్పానిష్, అరబిక్ వంటి అనేక అంతర్జాతీయ భాషల్లో ఈ చిత్రం అలరించనుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనస్, పృథ్విరాజ్ సుకుమారన్ నటిస్తున్న ఈ పాన్-వర్ల్డ్ మూవీని కె.ఎల్. నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా హీరో హీరోయిన్ల షూటింగ్ స్పాట్ లో వున్న ఫొటోను సోషల్ మీడియాలో విడుదల చేశారు.
ఎం.ఎం. కీరవాణి బాణీలు సమకూరుస్తున్న ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. ఇందులో పలు దేశాల నటులు కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.
దేవీ (మురళీకృష్ణ)
నిక్‌నేమ్- శక్తిమాన్
సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక......
మరింత చదవండి