సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: శనివారం, 2 మార్చి 2019 (21:08 IST)

కెటిఆర్‌ను కలిసిన రకుల్‌ప్రీత్ సింగ్.. ఎందుకు..?

హీరోయిన్లను హీరోలు కలవడం మామూలే. వారి మధ్య గాసిప్స్ చోటుచేసుకోవడం షరా మామూలే. అయితే రాజకీయ నాయకుడిని టాప్ హీరోయిన్ కలిస్తే ఏదో జరుగుతుందని అనుకోవాలి. ఆ హీరోయిన్ రాజకీయాల్లోకి వెళ్ళడమో లేకుంటే వేరే ఇతరత్రా పనులు ఏమైనా ఉన్నాయో అన్న కోణంలో చూడాల్సి ఉంటుంది.
 
అలాంటి పరిస్థితే తెలంగాణా మంత్రి కెటిఆర్.. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మధ్య ఏర్పడింది. రెండురోజుల క్రితం హైదరాబాద్ లోని ఒక ప్రముఖమైన హోటల్లో వీరిద్దరు రహస్యంగా కలిశారట. ఈ రహస్య కలయికకు అసలు కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే. ఇప్పటికే ఎన్నో ప్రభుత్వ కార్యక్రమాలతో తెలంగాణా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ప్రభుత్వ పథకాలు మరింతగా ప్రజలకు తెలియాలంటే ఖచ్చితంగా ప్రచారకర్త అవసరం. అది కూడా అందమైన హీరోయిన్ అయితే బాగుంటుందన్నది ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్దేశమట.
 
అందుకే కెటిఆర్‌కు ఆ బాధ్యతలను కెసిఆర్ అప్పగించారట. దీంతో కెటిఆర్ హీరోయిన్ల కోసం వెతుకుతున్న నేపథ్యంలో విషయం తెలుసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఆ అవకాశం కోసం కెటిఆర్‌ను కలవడానికి సిద్ధమైందట. ఆ క్రమంలో ఆమె కేటీఆర్‌ను కలిసి బ్రాండ్ అంబాసిడర్‌గా తను వ్యవహరిస్తానని చెప్పిందని, ఈ మేరకు ఆయనతో 10 నిమిషాలు మాత్రమే చర్చించుకున్నట్లు తెలుస్తోంది.