గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 24 ఫిబ్రవరి 2019 (09:13 IST)

జగన్ లండన్‌కు వెళ్తూ వెళ్తూ.. కేటీఆర్‌కు ఆ బాధ్యతలు అప్పగించారా?

తెలంగాణ మంత్రి కేటీఆర్, వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి కలిసి  ఏపీలో కుట్రలకు పాల్పడుతున్నారని..  వందమంది కేటీఆర్‌లు, జగన్‌లు వచ్చినా రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని అడ్డుకోలేరని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు. 
 
వైసీపీ అధినేత లండన్ వెళ్తూవెళ్తూ వైకాపా పార్టీ బాధ్యతలను కేటీఆర్‌కు ఇచ్చి వెళ్లినట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిపోవడం వంద శాతం పక్కా అని, జగన్ గెలుపు ఖాయమన్న కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా అచ్చెన్నాయుడు ఈ కామెంట్స్ చేశారు. 
 
వైసీపీ-టీఆర్ఎస్ మధ్య కొనసాగుతున్న రహస్య బంధం కేటీఆర్ వ్యాఖ్యలతో మరోమారు బయటపడిందని అచ్చెన్నాయుడు తెలిపారు. ఏపీలో శాంతిభద్రతలను విచ్ఛిన్నం చేసేందుకు ఈ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.