శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By
Last Updated : బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (17:41 IST)

నేరస్తుడికి హీరోలు అండగా నిలుస్తున్నారు.. పుల్వామా వెనుక మోదీ హస్తం

టాలీవుడ్ హీరోలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరస్తుడికి హీరోలు సరెండర్ అవుతున్నారని సెటైర్లు వేశారు. ఇటీవల నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో అక్కినేని నాగార్జునపై చంద్రబాబు పరోక్షంగా సెటైర్లు వేయడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతేగాకుండా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కూడా చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు.
 
ఏపీకి జ‌గ‌న్‌ను కెసిఆర్ సామంత రాజును చేయాల‌ని చూస్తున్నార‌ని మండిప‌డ్డారు. వైకాపాలో పెత్తందారీ వ్యవస్థ నడుస్తోందని నిప్పులు చెరిగారు.  హైదరాబాద్ కేంద్రంగా బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీ పొత్తును ప్రస్తావిస్తూ, బీజేపీ చేతిలో అన్నాడీఎంకే ఓ రిమోట్ కంట్రోల్ లా మారిపోయిందని ఎద్దేవా చేశారు.
 
ఆంధ్రప్రదేశ్ ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ని మంగ‌ళ‌వారం సాయంత్రం టాలీవుడ్ హీరో నాగార్జున హైద‌రాబాద్‌- లోట‌స్ పాండ్‌లో వున్న నివాసంలో ప్ర‌త్యేకంగా క‌లిసిన నేపథ్యంలో.. ఈ భేటీ ఏపీ రాజ‌కీయాల్లో పెను ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. 
 
నాగార్జున వైసీపీ త‌రపున గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేయ‌బోతున్నారంటూ జోరుగా ఊహాగానాలు కూడా మొద‌ల‌య్యాయి. ఈ భేటీపై చంద్ర‌బాబు నాయుడు బుధ‌వారం ఘాటుగా స్పందించారు. నేరస్తులకు హీరోలు అండగా నిలుస్తున్నారన్నారు. 
 
పుల్వామాలో ఆర్మీ కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడిపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సంచలన విమర్శలు చేశారు. ఈ దాడి వెనుక ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ లబ్ధి కోణం ఉందన్న అనుమానాలు పెరుగుతున్నాయని అన్నారు.