గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 17 ఫిబ్రవరి 2019 (11:04 IST)

'మన్మథుడు' సరసన 'దేవయాని'

టాలీవుడ్ 'మన్మథుడు' అక్కినేని నాగార్జున సరసన మరోమారు అనుష్క జతకట్టనుంది. కెరీర్ తొలి నాళ్ళ‌లో గ్లామ‌ర్ పాత్ర‌లు చేసిన అనుష్క ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ పాత్ర‌లు ఎక్కువ‌గా చేస్తూ వస్తోంది. త్వ‌ర‌లో కోన వెంక‌ట్ నిర్మాణంలో ఓ సినిమా చేయ‌నుంది. 
 
అయితే 'సూప‌ర్' చిత్రం ద్వారా తెలుగు తెర‌కి ప‌రిచ‌య‌మైన అనుష్క ఆ చిత్రంలో నాగార్జున స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించింది. అందులో అనుష్క‌కి మంచి పేరు వ‌చ్చింది. త‌ర్వాత కూడా నాగ్ స‌ర‌స‌న ప‌లు సినిమాల‌లో న‌టించింది. త‌న‌ని ఎంత‌గానో ప్రోత్స‌హించిన నాగ్‌పై ఉన్న అభిమానం కార‌ణంగానే ఆయ‌న సినిమాల‌లో గెస్ట్ పాత్ర‌ల‌కైన సై అంటుంది. 
 
ఈ నేపథ్యంలో అక్కినేని నాగార్జున త్వ‌ర‌లో రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో 'మ‌న్మ‌థుడు 2' చిత్రం చేయ‌నున్నాడు. పోర్చుగ‌ల్‌లో చిత్ర తొలి షెడ్యూల్ జ‌ర‌గ‌నుంద‌ని స‌మాచారం. ఇందులో క‌థానాయిక‌గా పాయ‌ల్ రాజ్‌పుత్ న‌టించ‌నుండగా, ముఖ్య పాత్ర‌లో అనుష్క‌ని ఎంపిక చేసిన‌ట్టు టాక్. మ‌రి దీనిపై క్లారిటీ రావాల్సివుంది.