గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By మోహన్ మొగరాల
Last Modified: గురువారం, 14 ఫిబ్రవరి 2019 (15:33 IST)

పార్కులో ప్రేమికులు... పసుపుతాడు కట్టించిన భజరంగ్ దళ్

భజరంగ్ దళ్ కార్యకర్తలు అన్నంత పని చేసారు. ఈరోజు వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేమికులు మరో ప్రపంచంలో విహరిస్తున్నారు. ప్రేమికుల రోజును పురస్కరించుకుని రెస్టారెంట్‌లు, పబ్‌లు, హోటళ్లు ప్రత్యేక ఏర్పాట్లు చేసాయి. మరోవైపు ప్రేమికులు రోడ్లు లేదా పార్కుల్లో కనిపిస్తే పెళ్లిళ్లు చేసేస్తున్నారు. 
 
మేడ్చల్‌లో ఓ ప్రేమ జంటకు భజరంగ్ దళ్ కార్యకర్తలు పెళ్లి చేసారు. స్థానికంగా సీఎంఆర్ కాలేజీకి ఎదురుగా ఉన్న పార్కులో కూర్చొని ఉన్న ఒక ప్రేమ జంటను భజరంగ్ దళ్ కార్యకర్తలు చుట్టుముట్టారు. ఆపై అబ్బాయితో అమ్మాయికి పసుపుతాడు కట్టించారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా పోలీసులు కేసు నమోదు చేసారు మరియు వీడియోలో ఉన్న కార్యకర్తలపై కూడా కేసు నమోదు చేస్తామని తెలిపారు.