మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By TJ
Last Modified: శనివారం, 7 జులై 2018 (20:13 IST)

మూడో ముడి పడుతుండగానే కుప్పకూలిన పెళ్ళికూతురు...

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మహేంద్రనగర్ కాలనీకి చెందిన లక్ష్మి, వెంకటేష్‌కు వివాహం నిశ్చయించారు పెద్దలు. తెల్లవారు జామున వివాహం చివరి దశకు చేరుకుంది. పెళ్ళి కొడుకు వెంకటేష్‌, లక్ష్మి మెడలో రెండు ముళ్ళు వేసి మూడో ముడి వ

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మహేంద్రనగర్ కాలనీకి చెందిన లక్ష్మి, వెంకటేష్‌కు వివాహం నిశ్చయించారు పెద్దలు. తెల్లవారు జామున వివాహం చివరి దశకు చేరుకుంది. పెళ్ళి కొడుకు వెంకటేష్‌, లక్ష్మి మెడలో రెండు ముళ్ళు వేసి మూడో ముడి వేస్తుండగా ఒక్కసారిగా లక్ష్మి కిందపడిపోయింది. అందరూ స్పృహ తప్పి పడిపోయి ఉంటుందని భావించారు.
 
ఆసుపత్రికి తీసుకెళ్ళి పరీక్ష నిర్వహించగా వధువు గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్థారించారు. వధువు మృతితో ఒక్కసారిగా కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాళ్ళ పారాణి ఆరకముందే, మూడుముళ్ళు పూర్తి కాకుండానే వధువు మృతి చెందడంతో వరుడు కూడా కన్నీంటి పర్యంతమయ్యాడు.