శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : గురువారం, 28 ఫిబ్రవరి 2019 (15:51 IST)

అభినందన్‌కు నా సెల్యూట్.. ఆయనే నా హీరో : కేటీఆర్

శత్రుదేశం పాకిస్థాన్ చేతికి చిక్కిన భారత వైమానికదళం పైలట్ అభినందన్ వర్ధమాన్‌ సురక్షితంగా ప్రాణాలతో తిరిగి రావాలంటూ దేశ ప్రజలంతా తమ తమ ఇష్టదైవాలను ప్రార్థిస్తున్నారు. అభినందన్ ఫోటోలకు పాలాభిషేకాలు చేస్తున్నారు. అదేసమయంలో మరికొందరు విపత్కర పరిస్థితుల్లో ఆయన ప్రదర్శించిన ధైర్యసాహసాలను కొనియాడుతున్నారు. ఇలాంటి వారిలో తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకరు. 
 
పాకిస్థాన్‌ చేతిలో బందిగా ఉన్న భారత వైమానిక దళం పైలట్‌ అభినందన్‌ వర్థమాన్‌ ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఒకవైపు 'దేశంలో స్వార్థ రాజకీయాలు, టీఆర్పీ రేటింగ్స్‌లో మీడియాలో యుద్ధాలు జరుగుతుంటే.. గాయాలపాలై ప్రత్యర్థికి చిక్కిన ఇండియన్‌ పైలట్‌ అభినందన్‌ ధైర్యం కోల్పోకుండా నిబ్బరంగా ఉంటూ.. దేశ రహస్యాలు వెల్లడించేందుకు నిరాకరించారు. విపత్కర పరిస్థితుల్లోనూ గొప్ప ధైర్యసాహసాలను, హుందాతనాన్ని ప్రదర్శించిన అభినందన్‌కు నా సెల్యూట్‌' అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. పైగా, అభినందన్‌ నా హీరో.. అతన్ని స్వదేశం తీసుకురండి అంటూ హ్యాష్‌ట్యాగ్‌లు జోడించారు.