1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Rithika Singh in Salaa Khadoos Telugu Remake with Venkatesh

'సాలా ఖడూస్' రీమేక్‌లో 'బాబు బంగారం'.. రితిక సింగే హీరోయిన్..?!

విక్టరీ వెంకటేష్.. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'బాబు బంగారం'. ప్రస్తుతం వెంకీ ఈ సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నా... తన తదుపరి సినిమా కోసం రెండు మూడు సబ్జెక్ట్‌లు రెడీగా ఉంచుకున్నారు. వ

Rithika Singh
విక్టరీ వెంకటేష్.. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'బాబు బంగారం'. ప్రస్తుతం వెంకీ ఈ సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నా... తన తదుపరి సినిమా కోసం రెండు మూడు సబ్జెక్ట్‌లు రెడీగా ఉంచుకున్నారు. వీటిలో రీమేక్‌లు కూడా ఉన్నాయి. బాలీవుడ్‌లో మంచి విజయం సాధించిన 'సాలా ఖడూస్' సినిమాను తెలుగులో రీమేక్ చెయ్యడానికి వెంకీ సన్నాహాలు చేస్తున్నారు. మాధవన్, రితిక సింగ్‌ హీరోహీరోయిన్లుగా సుధా కొంగర దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్స్ సాధించి రికార్డుల మోత మోగించిన విషయం తెలిసిందే. 
 
ఈ సినిమాను ఇప్పుడు తెలుగు రీమేక్ చెయ్యాలని చూస్తున్నాడట నిర్మాత పి.వి.పి. 'బాబు బంగారం' విడుదలైన వెంటనే వెంకీ ఈ రీమేక్‌లో నటించనున్నాడట. ఇప్పటికే ఈ రీమేక్‌కు సంబంధించిన తెలుగు స్క్రిప్ట్ సిద్దమవుతోందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. బాలీవుడ్ 'సాలా ఖడూస్' తన పాత్రతో హైలైట్‌గా నిలిచిన రితిక సింగ్‌నే ఈ తెలుగు రీమేక్‌లోనూ నటింపజేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. 
 
త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్ మీదకు తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇదిలావుంటే.. ఈ సినిమాకు వెంకీ గడ్డం బాగా పెంచాల్సి ఉంటుందట. ప్రస్తుతం "బాబు బంగారం'' తర్వాత, ఓ మలయాళ దర్శకుడితో వెంకీ ఓ సినిమా చేయబోతున్నాడనే వార్తలు ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తున్నాయి. మరి వీటిల్లో ఏది ముందుగా సెట్స్ పైకి వెళుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.! 
తర్వాతి కథనం
బాలయ్య 101 సినిమాలో రైతుగా.. మరి చిరంజీవి 151వ సినిమా ఎలాంటి పాత్రలో నటిస్తారో?