1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Sophisticated camera equipment for Janatha Garage

సొఫిస్టికేటెడ్ కెమెరాలతో 'జనతా గ్యారేజ్' చిత్ర షూటింగ్

Sophisticated camera
''శ్రీమంతుడు'' వంటి హిట్ చిత్రానికి దర్శకత్వం వహించి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు కొరటాల శివ. 'శ్రీమంతుడు' ఇచ్చిన విజయంతో ఎన్టీఆర్‌తో ''జనతా గ్యారేజ్'' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ సారథి స్టూడియోస్‌లో వేసిన ప్రత్యేక సెట్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత నిత్యా మీనన్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ చిత్రంలో ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. యువ సంచలనం దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. 
 
మాఫియా బ్యాక్ డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ''జనతా గ్యారేజ్'' చిత్రాన్ని హైక్వాలిటీ కెమెరాస్‌తో తెరకెక్కించనున్నట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. సూర్య నటించిన ''24'' చిత్రంతో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన తిరు 'జనతా గ్యారేజ్' చిత్రానికి కూడా సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. 
 
అయితే ఈ మూవీలో ప్రతీ ఫ్రేంని అందంగా చూపించడానికి ముంబై నుంచి హైక్వాలిటీ కెమెరాలు తెప్పిస్తున్నారట. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏ తెలుగు సినిమాకు కూడా ఈ రేంజ్ భారీ ఎక్విప్‌మెంట్స్ ఇంతవరకు ఉపయోగించక పోవడం గమనార్హం.
About Writer
chitra