అనుష్కపై రాజమౌళి అరిచారా...? ఎందుకని..?
అనుష్క.. బాహుబలి-2లో నటించాల్సి వుంది. తన పాత్ర గురించి చాలా కేర్ తీసుకుంటోంది. గతంలో కన్పించినంత ఫిజిక్‌తో కన్పించాల్సి వుంది. గతంలో ఇదే విషయంలో రాజమౌళి మందలిస్తే.. ఒళ్లు తగ్గించుకునేందుకు కాస్త టైం అడిగినట్లు సమాచారం. రెండో భాగం లేట్ కావడంతో సైజ్
అనుష్క.. బాహుబలి-2లో నటించాల్సి వుంది. తన పాత్ర గురించి చాలా కేర్ తీసుకుంటోంది. గతంలో కన్పించినంత ఫిజిక్‌తో కన్పించాల్సి వుంది. గతంలో ఇదే విషయంలో రాజమౌళి మందలిస్తే.. ఒళ్లు తగ్గించుకునేందుకు కాస్త టైం అడిగినట్లు సమాచారం. రెండో భాగం లేట్ కావడంతో సైజ్ జీరో.. చిత్రం చేసి ఒళ్లు పెంచుకుంది. కానీ ఇప్పుడు వళ్లు తగ్గినా.. రాజమౌళికి సరిపోలేదని తెలుస్తోంది.
ఇందుకు ఆమెను మందలించినట్లు చిత్ర యూనిట్ సమాచారం. ఈ నెల 13న ప్రారంభమైన షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు చిత్రించారు. అందులో యుద్ధ సన్నివేశాలున్నాయి. అయితే.. అనుష్క తన లావు తగ్గడానికి కోసం ఇంకాస్త టైం అడిగిందనీ.. అందుకే రాజమౌళి చిరాకు పడ్డాడని తెలుస్తోంది. త్వరలో అసలు విషయం తెలియనుంది.
తర్వాతి కథనం
