1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. AP CM Chandrababu fires at ysrcp calling it axe party

వైకాపా ముమ్మాటికి గొడ్డలి పార్టీనే .. 11 అరాచకాలు ఇవిగోండి : సీఎం చంద్రబాబు ధ్వజం

chandrababu
పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోమారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైకాపా ముమ్మాటికీ గొడ్డలి పార్టీయేనని ఆయన విమర్శించారు. చిత్తూరు జిల్లా కండ్రిగలో జరిగిన సంజీవని ప్రజావేదిక సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన 11 విషయాలు చెబుతానంటూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన 11 అరాచక విధ్వంసకర ఘటనలను ఏకరవు పెట్టారు. ఈ నిర్వాకాల వల్లే వైకాపాను తాను గొడ్డలి పార్టీ అని పిలుస్తున్నానని, ఆ పార్టీ ముమ్మాటికీ గొడ్డలి పార్టీయేనని స్పష్టం చేశారు. 
 
ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీలకు చోటు లేదన్నారు. సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం, గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. 
 
1. వివేకా హత్య, నాటకాలు.. అంతిమ లబ్దిదారు ఎవరో ప్రతి ఒక్కరికీ తెలుసు. 
2. కోడికత్తి డ్రామా , గులకరాయి డ్రామా.. పర్జలను మోసం చేసే ఎత్తుగడ
3. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్య హత్య, డోర్ డెలివరీ, నిందితుడికి వైకాపా అండదండలు.
4. మాస్క్ అడిగిన దళిత డాక్టరుపై దాడి, వేధించి ప్రాణాలు తీసిన వైకాపా ప్రభుత్వం
5. కుటుంబ బంధాలపై గొడ్డలివేటు, ఆస్తి ఇవ్వకుండా తల్లికి, చెల్లికి న్యాయం.
6. హిందూ దేవుళ్లపై అకృత్యాలు, అపవిత్ర కార్యక్రమాలు, కుట్రలు, తప్పుడు ప్రచారాలు. 
7. పోలవరం, అమరావతి, పెట్టుబడులు, అభివృద్ధి గొడ్డలి పార్టీ వేటు 
8. నందం సుబ్బయ్య , చంద్రయ్య, జల్లయ్యల పీకలు కోసేంత రక్త దాహంతో వైకాపా 
9. గంజాయి బ్యాచ్‌లకు ప్రోత్సాహం.. రప్ఫా రఫ్పా రంకెలు. జంతు రక్తంతో కటౌట్లకు అభిషేకాలు
10. కారు కింద సొంత కార్యకర్త సింగయ్యకు తొక్కించారు. కడప పెద్ద దస్తగిరిని చంపేశారు. 
11. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుకు రోజుకో నాటకం. పాస్టర్లతో దాడి డ్రమాలు అంటూ చంద్రబాబు పాయింట్ల వారీగా వివరించారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
అయ్యా సీఎం విజయ్ నీ ఉచిత కరెంట్ మాకొద్దు, డబ్బులిస్తాం ఇవ్వు నాయనా: తమిళనాడులో మొదలైన అసంతృప్తి, వీడియో