`సలార్`కు అదిరిపోయే రేటు వస్తోంది!
Prabhas still
తాజా విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వంద కోట్లకు పైగానే ఇచ్చేందుకు రెడీగా వున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కెజి.ఎఫ్. సినిమాను రెండు భాగాలుగా పెట్టి తీసిన హంబోలే సంస్థ ఇదేవిధంగా ఆకర్షణీయమైన రైట్స్‌ను రాబట్టుకుంది. అంతకంటే ఎక్కువ మొత్తంలో ప్రభాస్ సలార్‌ను రాబట్టుకోవాలని చూస్తుందని సమాచారం. ఇదే నిజమైతే సలార్ నిర్మించిన నిర్మాతకు పంట పండినట్లే. ఇది థియేటర్‌లో విడుదలైతే ఆ క్రేజ్ఎలా వుంటుందో కూడా చూడాల్సిందే.
