బుధవారం, 11 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 25 ఫిబ్రవరి 2021 (19:47 IST)

ప్రభాస్ మిర్చి రికార్డ్ దాటేసిన ఉప్పెన, మేకింగ్ వీడియో ఔట్

ఉప్పెన వసూళ్లు కుమ్మేస్తున్నాయి. రెండు వారాల్లోనే రూ. 51 కోట్లు దాటేసి విజయవంతంగా ముందుకు దూసుకువెళుతోంది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి నటించిన ఉప్పెన రూ .50 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం ఫిబ్రవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది.
 
కరోనా కారణంగా నిర్మాతలు తమ చిత్రాలను థియేటర్లలో విడుదల చేయడానికి చాలా కాలం వేచి వుండాల్సి వచ్చింది. ఎందుకంటే ఇది కంటెంట్ నడిచే చిత్రం బాక్సాఫీస్ వద్ద కొంత లాభాలను పొందుతుంది. ఊహించినట్లుగా, ఈ చిత్రం కరోనా ప్రభావం ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు వసూలు చేస్తోంది.
 
2021 ప్రారంభంలో తెలుగు ఇండస్ట్రీకి ఉప్పెన చిత్రం పెద్ద బూస్ట్ అని చెప్పాలి. గతంలో ఫిబ్రవరి నెలలో అత్యధిక వసూళ్లు చేసినది ప్రభాస్ మిర్చి. మిర్చి జీవితకాల వసూలు రూ. 48.5 కోట్లని చెప్తారు. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెనతో ప్రభాస్ మిర్చి రికార్డును అధిగమించాడు. ఇకపోతే తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ ఉప్పెన మేకింగ్ వీడియోను రిలీజ్ చేసారు.