సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (14:41 IST)

"ఉప్పెన'' యూనిట్ సభ్యులకు 'చిరు' కానుక ఖరీదు ఎంతో తెలుసా?

మెగా ఫ్యామిలీ హీరో వైష్ణవ్ తేజ్ - కృతిశెట్టి జంటగా నటించిన చిత్రం ఉప్పెన. బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించగా, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రం విడుదలైన తొలి ఆట నుంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ముఖ్యంగా. ఈ చిత్రం విజయం చిరంజీవికి ఎంతో ఆనందనిచ్చింది. అందుకే ఆయన ఉబ్బితబ్బిబ్బులైపోతున్నారు. చిత్ర దర్శకుడుతో యూనిట్ సభ్యులను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. 
 
అంతటితో ఆగని చిరంజీవి తన సంతోషాన్ని 'ఉప్పెన' యూనిట్ సభ్యులతో పంచుకుంటున్నారు. కీలక సభ్యులకు బహుమతులు, అభినందన లేఖలు పంపించారు. స్పెయిన్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ ఉత్పత్తుల సంస్థ 'లాడ్రో' విక్రయిస్తున్న 'ది థ్రిల్‌ ఆఫ్‌ లవ్‌ కపుల్‌ ఫిగరైన్' బొమ్మలను పంపించారు. 
 
సముద్రం ఒడ్డున మోకాళ్లపై కూర్చుని కళ్లలో కళ్లు పెట్టి చూసుకుంటునట్టున్న యువ జంట బొమ్మ ఖరీదు రూ.89 వేలట. నిర్మాణంలో భాగస్వామి అయిన ప్రముఖ దర్శకుడు సుకుమార్‌కు కూడా చిరంజీవి ఈ బహుమతి పంపారు. దీంతో తన ఆనందాన్ని సుకుమార్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 'కొణిదెల చిరంజీవి, మద్రాసు, ఇండియా.. ఈ అడ్రస్‌కు చిన్నప్పుడు అమాయకంగా రాసిన లేఖలకు ఇప్పుడు ప్రతిలేఖ వచ్చినంత అనుభూతి..!' కలుగుతోంది అంటూ పేర్కొన్నారు.