గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (18:14 IST)

" ఉప్పెన" విజయం మీ ధైర్యానికి.. అభిరుచికి నిదర్శనం : చిరంజీవి

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో వైష్ణవ్ తేజ్. ఈ యువ హీరో నటించిన తొలి చిత్రం "ఉప్పెన". కృతిశెట్టి హీరోయిన్. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ హిట్ కొట్టింది. 
 
ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తన మేనల్లుడి విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఉవ్వెత్తున ఎగసిన ఈ ఉప్పెన విజయం మీ ధైర్యానికి, అభిరుచికి నిదర్శనం అంటూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్, రవిలను అభినందించారు. 
 
చిరు చినుకు నుంచి ఉప్పెనగా మారేంతవరకు ఆ సినిమాకి వెన్నంటే నిలిచిన వాయువు మీరు అంటూ కొనియాడారు. ఈ విజయంవైపు ప్రయాణం తమదే అయినా, ఆ ప్రయాణం వెనుక ధైర్యం మీరు అంటూ ప్రశంసించారు.
 
కథగా విన్నప్పటి నుంచి సినిమాగా మారేంత వరకు మా ప్రతి అడుగుకి మార్గదర్శి మీరు అంటూ చిరంజీవి కితాబునిచ్చారు. ఎన్నో అడ్డంకులు వచ్చినా, మీరు ఇచ్చిన ధైర్యానికి సర్వదా కృతజ్ఞులం అని చిరంజీవి పేర్కొన్నారు. 
 
'ఇలాంటి మంచి సినిమాను  ప్రేక్షకులు వెండితెర మీద చూడాలన్న మీ తపన మమ్మల్ని నడిపించింది' అంటూ తన సందేశంలో పేర్కొన్నారు. కాగా, ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.