గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 ఫిబ్రవరి 2021 (23:17 IST)

వరలక్ష్మి శరత్‌కుమార్‌కు టాలీవుడ్‌లో దశ తిరిగిందా?

టాలీవుడ్‌లో కమల్ హాసన్ నట వారసురాలిగా వచ్చి స్టార్ హీరోయిన్ అయిపోయింది శృతి హాసన్. ఆమెతో పాటు వరలక్ష్మి కూడా సత్తా చూపిస్తుంది. శరత్ కుమార్ కూతురుగా ఇండస్ట్రీకి వచ్చిన ఈమె.. ఇప్పుడు వరస అవకాశాలతో దూసుకుపోతుంది. కేవలం హీరోయిన్ గానే నటిస్తానని కూర్చోకుండా కారెక్టర్ ఆర్టిస్టు అయిపోయింది వరలక్ష్మి. మొదట్లో కొన్ని సినిమాలు మాత్రమే హీరోయిన్‌గా నటించినా కూడా ఆ తర్వాత తన ఇమేజ్‌కు తగ్గట్లు విలన్‌గా సెటిల్ అయిపోయింది.
 
ఇప్పటికే సర్కార్, పందెంకోడి 2 సహా చాలా సినిమాల్లో విలన్‌గా రప్ఫాడించింది. మొన్నటికి మొన్న తెలుగులో క్రాక్ సినిమాలో జయమ్మగా అదిరిపోయే పర్ఫార్మెన్స్ చేసింది వరలక్ష్మి. ఆ దెబ్బతో తెలుగులోనూ బిజీ ఆర్టిస్ట్ అయిపోయింది ఈమె. 
 
తాజాగా విడుదలైన నాంది సినిమాలో కూడా ఓ అద్భుతమైన పాత్రలో నటించింది వరలక్ష్మి. ఇందులో లాయర్ పాత్రలో మెరిసింది వరలక్ష్మి. ఆమె వచ్చిన తర్వాత సినిమా రేంజ్ మరింత పెరిగిపోయింది. కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ సినిమాలో ఇండియన్ పీనల్ కోడ్ గురించి చర్చించారు. ఇంటర్వెల్ ముందు వచ్చే ఈ పాత్ర సినిమా స్థాయిని పెంచేసింది. ఈ సినిమా తర్వాత వరలక్ష్మికి మంచి మంచి ఆఫర్లు రావడం ఖాయమని సినీ పండితులు అంటున్నారు.