సంబంధిత వార్తలు
- నవ్యాంధ్ర అభివృద్ధిని భ్రష్టు పట్టిస్తున్నారు... భూమా అఖిల ప్రియ ఫైర్
- 'జిగేలు రాణి'కి అదిరిపోయే బహుమతి ఇచ్చిన సుకుమార్
- అఖిల్ చివరికి ఆ దర్శకుడికి ముద్దెట్టి పారిపోయాడే..? (వీడియో)
- "రంగస్థలం" రామలక్ష్మి ఛాన్స్ నాకే వచ్చింది : అనుపమ పరమేశ్వరన్
- రంగస్థలం కొత్త రికార్డు... పోకిరి, ఇంద్ర, ఖుషీ రికార్డులను బ్రేక్ చేసింది..
అఖిల్‌తో సుకుమార్ సినిమా... మరో రంగస్థలమేనా?
అక్కినేని అఖిల్ ప్రస్తుతం తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరితో సినిమా చేస్తున్నాడు. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం లండన్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వా
అక్కినేని అఖిల్ ప్రస్తుతం తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరితో సినిమా చేస్తున్నాడు. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం లండన్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత అఖిల్ సత్యప్రభాస్ పినిశెట్టితో సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అఖిల్ గురించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే... అఖిల్ హీరోగా సుకుమార్ ఓ సినిమా నిర్మించడానికి రంగం సిద్ధమవుతోందట. అయితే ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించడంలేదట.
సుకుమార్ కథతో అతని అసిస్టెంట్ ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు చేప్టటే అవకాశముందని తెలుస్తోంది. ఆల్రెడీ సుకుమార్ ఓ స్టోరీ లైన్‌ని నాగ్‌కి చెప్పాడట. అఖిల్ కూడా ఈ కథ విన్నాడట. నాగ్, అఖిల్ ఇద్దరూ ఈ స్టోరీ లైన్‌కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సుకుమార్ బ్యానర్లో సినిమా నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఈ సినిమాకి సుకుమార్‌తో పాటు నాగార్జున కూడా ఓ నిర్మాతగా వ్యవహరించనున్నారట. త్వరలోనే అఫిషియల్‌గా ఎనౌన్స్ చేస్తారని తెలిసింది.
తర్వాతి కథనం
