శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 12 జులై 2018 (18:12 IST)

అఖిల్ చివరికి ఆ దర్శకుడికి ముద్దెట్టి పారిపోయాడే..? (వీడియో)

అఖిల్ అక్కినేని సినిమాపై రకరకాల వార్తలు వస్తున్నాయి. అఖిల్ నటించిన తొలి రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్స్ సంపాదించిపెట్టకపోవడంతో.. మూడో సినిమా ఎంపికలో అఖిల్ ఆచితూచి వ్యవహరిస్తున్నాడని వార్తలొచ్చా

అఖిల్ అక్కినేని సినిమాపై రకరకాల వార్తలు వస్తున్నాయి. అఖిల్ నటించిన తొలి రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్స్ సంపాదించిపెట్టకపోవడంతో.. మూడో సినిమా ఎంపికలో అఖిల్ ఆచితూచి వ్యవహరిస్తున్నాడని వార్తలొచ్చాయి. అంతేగాకుండా... అఖిల్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడని తెలిసింది. 
 
కానీ వీరిద్దరి మధ్య  విభేదాలు వచ్చాయని, స్క్రిప్టులో వెంకీ మార్పులు చేస్తుండడంతో అఖిల్‌కు అది న‌చ్చ‌క  రెండురోజులు షూటింగ్‌కు రాలేద‌ని ఇటీవల గాసిప్స్‌ వచ్చాయి. కొన్ని వెబ్‌సైట్లు అఖిల్ సినిమాపై రాసిన రాతలకు విసిగిపోయిన అఖిల్.. ఓ వీడియోను పోస్టు చేశాడు. ఈ వార్తలను గుర్తించిన అఖిల్‌, వెంకీ అట్లూరి అలాంటి వార్తలను ఎద్దేవా చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. 
 
'మీరే డైరెక్టురుగా.. ముందుగా మీరే మాట్లాడండి.. మీరు హీరోగా మీరే మాట్లాడండి' అంటూ ఇరువురు నిజంగానే గొడవ పడుతున్నట్లు ఆ వీడియో ఉంది. చివరికి వారిద్దరూ బిగ్గరగా నవ్వారు. అఖిల్ చివరికి దర్శకుడికి ముద్దెట్టి పారిపోయాడు. ఈ వీడియోను బట్టి.. దర్శకుడైన అట్లూరికి తనకు ఎలాంటి విబేధాలు లేవని అఖిల్ చెప్పకనే చెప్పేశాడు. అదన్నమాట సంగతి.