ప్రియమైన మిత్రులారా, మా డిజిటల్ సర్వీసెస్ చొరవ అయిన రిలయన్స్ జియోతో నేను ప్రారంభించదలుచుకున్నాను. నా గత ప్రసంగం నాటికి, నేటి ఈ సమయానికి మా కస్టమర్ల సంఖ్య రెట్టింపు అయి 215 మిలియన్లకు చేరింది. 215 మిలియన్ల ప్రజలు కేవలం 22 నెలల కాలంలోనే దక్కడం అనేది రికార్డ్. ఇలాంటి రికార్డును ప్రపంచంలోనే మరే టెక్నాలజీ సంస్థ కూడా ఇప్పటివరకు సాధించలేదనే విషయాన్ని ఈ సందర్భంగా వెల్లడిస్తున్నాను. గత ఏడాది కాలంలో, మేం మునుపెన్నడూ లేని ద్విగుణీకృతమైన వృద్ధిని సాధించాం. ఇది ఇప్పటికే ఉన్న విస్తృతమైన వినియోగదారుల మద్దతకు తోడైన అంశాలు:
డేటా వాడకం నెలకు 125 కోట్ల జీబీ నుంచి 240 పైగా పెరిగింది. గత ఏడాది మేం ప్రపంచంలోనే అతిపెద్ద మెుబైల్ డేటా నెట్‌వర్క్ గుర్తింపును పొందగనిగాం మరియు మిగతా పోటీదారులతో పోల్చితే గత 12 నెలలుగా మా పరిధిని విస్తృతం చేసుకున్నాం. ప్రతి రోజూ వాయిస్ వాడకం పెద్ద ఎత్తున వృద్ధి చెందింది. ప్రతిరోజూ 250 కోట్ల నిమిషాలుగా ఉన్న వాడకం 530 కోట్ల నిమిషాలకు చేరింది. నెలకు ప్రతిరోజు వీడియో స్పష్టమైన రెట్టింపు గణాంకాలు అనేది మరే అంశంలోనూ పోలిక లేనిది. మా వినియోగదారులు చురుకుగా మా నెట్‌వర్క్‌తో రోజుకు సగటున 290 నిమిషాలకు పైగా అనుసంధానం అయి ఉంటున్నారు.
మా సామర్థ్యం విషయానికి వస్తే...
గత 12 నెలల కాలంలో మా నెట్‌వర్క్ సామర్థ్యాన్ని రెట్టింపు కంటే ఎక్కువగా మేం విస్తరించగలిగాం. 215 మిలియన్ల మందికి పైగా విజయవంతంగా సేవలు అందిస్తున్నప్పటికీ జియో నెట్‌వర్క్ సామర్థ్యంలో ఇది 20% కంటే తక్కువే. దీని అర్థం, మేం మా వినియోగదారులను అనేక రెట్లు వృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంది. అదే సమయంలో ఈ ప్రక్రియకు ఎలాంటి మెుత్తం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండానే ఈ అవకాశాన్ని కైవసం చేసుకోవచ్చు.
ఇలాంటి అనూహ్యమైన నెట్‌వర్క్ వృద్ధి గుర్తింపును సాధిస్తూనే మా నంబర్ వస్ స్థానాన్ని విజయవంతంగా కలిగి ఉండగలింగాం. ట్రాయ్ స్పీడ్ టెస్ట్ డేటా ప్రకారం గత ఏడాది ప్రతి మాసంలోనూ భారతదేశంలో ఫాస్టెస్ట్ నెట్‌వర్క్ గుర్తింపును సొంతం చేసుకోగలిగాం. మా అత్యుత్తమమైన సేవల అనుభూతిని కొద్ది సమయం అయినా పూర్తి స్థాయిలో అందించే వినియోగదారులు ఒక శాతం మాత్రమే ఉన్నారని మేం గుర్తించాం. అయితే మేం వారిని మరింతగా సంతృప్తి పరిచేందుకు మరియు ఉత్సాహభరితంగా వారు మా సేవలు అందుకునేందుకు తగు రీతిలో శ్రమిస్తున్నాం. వినియోగదారుల ఆకాంక్షలకు పెద్దపీట వేసే సంస్థగా ముందుకు సాగుతున్న జియో మా ప్రియమైన వినియోగదారుల్లో ఒక్కరు కూడా మా నెట్‌వర్క్ వలన నిరుత్సాహానికి లోనుకాకూడదని కృతనిశ్చయంతో ఉన్నాం.
జియో ఫోన్ గురించి మరిన్ని కొత్త అంశాలను ఈ సందర్భంగా నేను మీతో పంచుకుంటాను.
జియోఫోన్ దేశంలో కొత్త తుపానును సృష్టించింది. ఈ సందర్భంగా నేను మరో విషయాన్ని మీకు తెలియజేయదల్చుకున్నాను. దేశంలో ప్రస్తుతం 25 మిలియన్లకు పైగా జియో ఫోన్ యూజర్లు ఉన్నారు. జియో ఫోన్‌ను తదుపరి దశకు తీసుకువెళ్లడంలో భాగంగా అనేక కొత్త సామర్థ్యాలను జోడించడం మరిన్ని సేవలను అందించేందుకు సిద్ధంగా ఉన్నాం.
మిత్రులారా,
భారతదేశంలో బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ విషయంలో తర్వాతి దశలో ఏం జరుగనుంది? మెుబైల్ బ్రాడ్‌బ్యాండ్ స్పేస్ విషయంలో భారతదేశం గ్లోబల్ లీడర్‌షిప్ స్థానంలో ఉన్నప్పటికీ ఫిక్స్‌డ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్ విషయంలో మనం ఇప్పటికీ వెనకబడే ఉన్నాం. ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ వాడకం విషయంలో ప్రపంచవ్యాప్త ర్యాంకింగ్‌లో భారతదేసం 134వ స్థానంలో ఉంది. సరైన రీతిలో లేని ఫిక్స్‌డ్ లైన్ మౌలికసదుపాయాలు ఈ పరిస్థితికి ప్రధాన కారణం. అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కలిగి ఉన్న దేశాల్లో 80% పైగా డేటాను ఫిక్స్‌డ్ లైన్ కనెక్టివిటీ ద్వారా ఇల్లు, ఆఫీసు నుంచే అనుసంధానం అయ్యాయి.
ఆప్టికల్ ఫైబర్ ఆధారిత ఫికబ్స్ లైన్ బ్రాడ్ బ్యాండ్‌దే రాబోయే భవిష్యత్ కాలం. డేటా స్పీడ్‌లో సెకనుకు వందల కొద్ది మెగాబైట్ల, గిగా బైట్లను ఫిక్స్‌డ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్ అందిస్తుంది. ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్రాండ్ సేవల్లో ప్రపంచంలోని టాప్ 5 దేశాల్లో భారత్‌ను నిలిపేందుకు జియో లక్ష్యం నిర్దేశించుకొని ముందుకు సాగుతోంది. మీ కంపెనీ ఇప్పటికే రూ. 2,50,000 కోట్లను అత్యాధునిక డిజిటల్ ఇన్‌ప్రాస్ట్రక్చర్‌ను అందించేందుకు పెట్టుబడి పెట్టింది. అతిపెద్ద ఫైబర్ మౌలిక సదుపాయాలు గల సంస్థగా నిలిచిన జియో మెుబైల్, బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీలో వేగంగా ముందుకు సాగుతోంది.
ఈ ఫైబర్ కనెక్టివిటీ సదుపాయాన్ని ఏకకాలంలో 1100 నగరాల్లో నివాసాలకు, వ్యాపార సముదాయాలకు, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకు, భారీ పరిశ్రమలకు అత్యుత్తమ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ సొల్యూషన్స్ అందిచేందుకు ముందుకు సాగుతున్నాం.
మీ ఇంటిలోని విశాలమైన టీవీల ద్వారా ఆల్ట్రా హై డెఫినిషన్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తుంది. మీ లివింగ్ రూంలో మల్టీ పార్టీ వీడియో కాన్ఫరెస్స్ సదుపాయాన్ని అందిస్తుంది. మీరు చెప్పే ప్రతి మాటను విని పాటించే వాయిస్ యాక్టివెటేడ్ వర్చ్యువల్ అసిస్టెంట్స్‌ను సేవలు అందిస్తుంది. వర్చువల్ రియాలిటీ గేమింగ్, డిజిటల్ షాపింగ్ అనుభవాల్లో అద్భుతమైన అనుభూతులను మిగిల్చనుంది.
స్మార్ట్ హోం సొల్యూషన్స్‌లో భాగంగా వందలాది నెక్యురిటీ కెమెరాలు, హోం అప్లయెన్స్‌లు వంటివే కాకుండా లైట్లు మరియు స్విచ్‌లు వంటివి కూడా సంబంధిత గృహ యజమానికి చెందిన స్మార్ట్ ఫోన్ ద్వారా ఇంటిలో ఉన్నా ఇంటిబయట ఉన్నా పూర్తి స్థాయిలో అదుపులో ఉంచుకునే అవకాశం వస్తుంది. దేస ప్రయోజనాలకు దృష్టిలో ఉంచుకుని విప్లవాత్మక మార్పులకు వేదికగా నిలిచే వ్యాపార ఆవిష్కరణంగా జియో నిలుస్తోంది.
భారతదేశానికి చెందిన చిన్న, మధ్యతరహా వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని విశే, రీతిలో వృద్ధి చెందించుకోవడం వలన పెద్ద ఎత్తున ఉపాధి కల్పించి భారత ఆర్థిక వృద్ధిరేటును వేగంగా ముందుకు తీసుకుపోవడంలో తమదైన ముద్ర వేసుకోనున్నారు.
ఇదే రూపంలో భారీ పరిశ్రమలకు ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ లైన్ అంటే....
గ్లోబల్ మార్కెట్‌లో పోటీ పడే సామర్థ్యంను డిజిటల్ టూల్స్ మరియు నైపుణ్యాల ద్వాహా కలిగి ఉన్న నేపథ్యంలో ఈ సౌలభ్యం అందుబాటులోకి రావడం నాలుగో పారిశ్రామిక విప్లవంగా నిలవనుంది. ఈ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను జియో గిగా ఫైబర్ అని మేం పిలుస్తున్నాం.
ప్రియమైన మిత్రులారా...
మూడు పాపులర్ యాప్స్ అయిన యూ ట్యూబ్, వాట్సాప్, ఫేస్ బుక్ వచ్చే ఆగస్టు 15వ తేదీ నుంచి జియోఫోన్ వినియోగదారులందరికీ అందుబాటులోకి రానున్నాయి. జియో ఒక ఉన్నతమైన ఉద్దేశంతో ఏర్పడింది. డిజిటల్ విప్లవం సాయంతో భారతదేశాన్ని మార్పు చెందించేందుకు జియో ఆవిర్భవించింది. ఈ కల సాకారం అయ్యేందుకు ప్రతి ఒక్క భారతీయుడు డిజిటల్ ఇండియన్ అవ్వాలి. ప్రస్తుతం భారతదేశంలో 500 మిలియన్ల ప్రజల వద్ద ఫీచర్ ఫోన్లు వున్నాయి. వీరంతా ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోలేరు. అందుబాటులో ధరలు లేకపోవడం వల్ల డిజిటల్ జీవనశైలికి సంబంధించిన అవకాశాలను వీరంతా అందుకోలేకపోతున్నారు. అందుకే మేం గత ఏడాది జియో ఫోన్-ఇండియా కా స్మార్ట్ ఫోన్‌ను రూ. 1500 తిరిగి చెల్లించే డిపాజిట్ ద్వారా అందించాం. మరో రూపంలో చెప్పాలంటే ఒక్క రూపాయి చెల్లించనక్కర్లేకుండానే ఫోన్ సొంతం చేసుకున్నారన్నమాట.
25 మిలియన్ల ప్రజలు ఈ స్కీంను ఉపయోగించుకుని జియో ఫోన్ వినియోగదారులుగా మారారు. ఈ పథకం, రాబోయే కాలంలో కూడా కొనసాగుతుంది. ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం మరో ఆకర్షణీయమైన పథకాన్ని ఈ సందర్భంగా మేం ప్రకటిస్తున్నాం. ఇదే జియో ఫోన్ మాన్‌సూన్ హంగామా ఆఫర్.
జూలై 21వ తేదీ నుంచి ప్రస్తుతం వారి వద్దనున్న జియో ఫోన్‌ను ఎక్సేంజ్ చేసుకుని బ్రాండ్ న్యూ జియో ఫోన్‌ను కేవలం రూ. 501కే సొంతం చేసుకోవచ్చు. తద్వారా మేము జియో ఫోన్ ప్రారంభ ధరను రూ. 1500 నుంచి రూ. 501కి తగ్గించగలిగాం. ఈ ఆగస్టు 15వ తేదీ నుంచి మా జియో ఫోన్ 2 రూ.2999తో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.
భారతదేశంలో జియో ఫోన్ ద్వారా డిజిటల్ రివల్యూషన్‌ను మరింత వేగవంతం చేయడం మా ప్రధాన ఉద్దేశ్యం. తద్వారా ప్రతి ఒక్క భారతీయుడు ఇంటర్నెట్‌కు అనుసంధానం అయి వుండి డిజిటల్ లైఫ్‌ను ఆస్వాదించగలరు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే jio.comలో అందుబాటులో వుండనున్నాయి.
ఈ నూతన సదుపాయాలను అందుబాటులోకి తేవడం ద్వారా భారతదేశంలో విస్తృతంగా వున్న మాన నెట్వర్క్ విస్తృతి మరియు బలమైన రిటైల్ సేవల సౌలభ్యంతో జియో టీం 100 మిలియన్ల యూజర్లను జియో ఫోన్ ద్వారా స్వల్ప కాలంలోనే సొంతం చేసుకుంటుందని విశ్వసిస్తున్నాను.
మిత్రులారా...
జియో గిగా ఫైబర్ ఉత్సాహభరితమైన అనుభూతిని భారతీయ వినియోగదారుల డిజిటల్ జీవనశైలిని అనూహ్య రీతిలో మార్చనుంది.
జియో గిగా ఫైబర్ ఎప్పటి నుంచి అందుబాటులోకి రానుంది?
ప్రస్తుతం వేలాది నివాసాల్లో జియో గిగా ఫైబర్ సేవలను బీటా ట్రయిల్‌ను అందుబాటులోకి తెచ్చాం. ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీ నుంచి మై జియో లేదా జియో.కాం ద్వారా జియో గిగా ఫైబర్ పొందేందుకు మీ ఆసక్తిని వ్యక్తం చేయవచ్చు. మాకు అందిన రిజిస్ట్రేషన్ దరఖాస్తుల్లో ఎక్కువ వచ్చిన వాటి ఆధారంగా జియోగిగా ఫైబర్ సేవలను ఏయే ప్రాంతాల్లో అందించానే అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నాం.
ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ఫిక్స్‌డ్ బ్రాడ్ బ్యాండ్ లైన్ గుర్తింపును జియో గిగా ఫైబర్ సొంతం చేసుకోనుంది. భారతదేశంలో 1100 నగరాల్లో ఏక కాలంలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య సంబరాలు జరుపుకోవడంతోపాటుగా డజిటల్ స్వేచ్ఛను కూడా పొందేందుకు సైన్ ఇన్ అవండి.
మీ ఆసక్తిని నమోదు చేసుకోవడం మరియు మీ చుట్టుపక్కల వారి ఆసక్తిని కూడా నమోదు చేయించడం మరిచిపోకండి. తద్వారా మీరు జియో గిగా ఫైబర్ తొలి వినియోగదారులుగా గుర్తింపు పొందండి. ఫైబర్ ఆధారిత మరియు మొబైల్ ఆధారిత బ్రాండ్ బ్యాండ్ కనెక్టివిటి సేవలు అందించే దేశాలో జాబితాలో భారతదేశాన్ని టాప్ 5వ స్థానంలో నిలిపేందుకు జియో కృషి చేస్తోంది.
రాబోయే దశాబ్దాలపాటు వినియోగదారుల అవసరాలను తీర్చేవిధంగా, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఫలితాలను అందించేందుకు తగిన రీతిలోని సాంకేతికతను మేం ఇప్పటికే రూపొందించి వున్నాం. భారతదేశ వ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి వచ్చేలా మరెవరికీ సాధ్యం కానటువంటి రీతిలోని డిజిటల్ కనెక్టివిటీ ప్లాట్‌ఫాంను జియో రూపొందించింది.
తద్వారా రిలయన్స్ వ్యూహాత్మకంగా టెక్నాలజీ ప్లాట్‌ఫాం కంపెనీగా ఆవర్భవించింది. కొత్త తరం సేవలు మరియు కంపెనీల ఎదుగుదలకు డిజిటల్ ప్లాట్‌ఫాం అనేది ప్రస్తుతం ఆవశ్యకంగా మారింది. డిజిటల్ కనెక్టివిటీ, కంప్యూటింగ్ మరియు సాఫ్ట్వేర్ ఆధారంగా ఏర్పడిన ఈ వేదికలు నూతన విలువను సృష్టించడం హైపర్ గ్రోత్ ఇంజిన్లుగా నిలుస్తున్నాయి.
గతంలో విద్యుత్, అనంతరం వనరులు సంపంద సృష్టికి కీలకమైనవిగా నిలిస్తే డాటాను ప్రాధమికమైన అంశంగా తీసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ప్రస్తుతం సంపద సృష్టి జరుగుతోంది. ప్రస్తుతం ప్రపంచంలో స్మార్ట్ బిజినెస్ ఐడియాలు వుంటే ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరి ద్వారా అయినా సంపద సృష్టి కలిగించే స్థాయికి చేరింది. భవిష్యత్ అవసరాలు తీర్చేందుకు, లక్ష్యాలను సాధించేందుకు అవకాశాలు అందుకునే స్థాయికి మీ కంపెనీ ఇప్పటికే సిద్ధమైందని తెలియజెప్పేందుకు నేను ఎంతగానే సంతోషిస్తున్నాను... అని ముగించారు ముకేష్ అంబానీ.