మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 2 జులై 2018 (11:36 IST)

"రంగస్థలం" రామలక్ష్మి ఛాన్స్ నాకే వచ్చింది : అనుపమ పరమేశ్వరన్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం "రంగస్థలం". సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గత మార్చి నెలలో విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ చిత్రం రామలక్ష్మి పాత్రను సమంత అక్కినేని పోషించింది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం "రంగస్థలం". సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గత మార్చి నెలలో విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ చిత్రం రామలక్ష్మి పాత్రను సమంత అక్కినేని పోషించింది. వాస్తవానికి ఈ పాత్ర తొలుత అనుపమ పరమేశ్వరన్‌కు వచ్చిందట.
 
ఇదే అంశంపై ఆమె స్పందిస్తూ, 'రంగ‌స్థ‌లం'లో రామ‌ల‌క్ష్మి పాత్ర కోసం ముందుగా న‌న్నే సంప్ర‌దించారు. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ సినిమా చేయ‌డం కుద‌ర‌లేదు. ఆ సినిమా చూసిన త‌ర్వాత స‌మంత‌ను తీసుకోవ‌డమే క‌రెక్ట్ అనిపించంది అన్నారు. 
 
పైగా, రామ‌ల‌క్ష్మిగా స‌మంత అద్భుతంగా న‌టించారు. ఈ విష‌యం సుకుమార్‌గారికి కూడా ఫోన్ చేసి చెప్పాను. అలాగే 'మ‌హాన‌టి'లో కీర్తి సురేష్‌, 'స‌మ్మోహ‌నం'లో అదితి న‌ట‌న కూడా బాగా న‌చ్చిందని అనుపమ చెప్పుకొచ్చింది.