శుక్రవారం, 21 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 మే 2024 (21:45 IST)

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

tamannah
తమన్నా ప్రస్తుతం గాఢమైన ప్రేమలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది. వీరిద్దరూ చాలా రోజుల నుంచి డేటింగ్‌లో ఉన్నారని బిటౌన్ కోడై కూస్తోంది. రిలేషన్ గురించి వీరిని ప్రశ్నించగా..అలాంటిది ఏమీ లేదని..తామిద్దరం కేవలం స్నేహితులమే అంటూ మొదట్లో కలరింగ్ ఇచ్చారు. కానీ ఆ తర్వాత వారిద్దరూ ప్రేమికులని బయటపడింది. 
 
తమ మధ్య ఉన్న ప్రేమను బయటపెట్టారు. మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని..త్వరలోనే పెళ్లికి చేసుకోబోతున్నామంటూ ఈ జంట ప్రకటించింది. తాజాగా తమన్నాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమన్నా తల్లి కాబోతుందనే వార్త నెట్టింట వైరల్‌గా మారింది. పెళ్లి కాకముందే ఓ బిడ్డను కనాలని ఈ జంట డిసైడ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. ఒకరిని కన్న తర్వాత పెళ్లి చేసుకుంటే లైఫ్ బాగుంటుందని బాధ్యతలు తెలుస్తాయని వీరిద్దరి మధ్య చర్చ వచ్చిందట. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.