సంబంధిత వార్తలు
- పోటీ చేసిన రెండు చోట్ల గెలిచిన టీవీకె విజయ్, త్రిష డిప్యూటీ సీఎం?
- PawanKalyan: వాదోపవాదాలకు దారితీసిన పవన్ కళ్యాణ్ బంగారం 20వ వార్షికోత్సవం
- తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : ట్రెండింగ్లో 'త్రిష' - 'జన నాయగన్'
- హీరోయిన్ త్రిష ఇంటికి బాంబు బెదిరింపు
- Vijay: జననాయగన్ లీక్ నాకు కోపం తెప్పిస్తోంది : విజయ్ దేవరకొండ
Trisha: విజయ్ వదిలేసిన స్థానంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా త్రిష పోటీ?
తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సినీ నటి త్రిష ప్రస్తుతం ఎమ్మెల్యే బరిలోకి దిగనున్నారని తెలుస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభంజనం సృష్టించింది.. ఈ అనూహ్య విజయం నేపథ్యంలో ప్రముఖ కథానాయిక త్రిష రాజకీయ ప్రవేశంపై జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి.
టీవీకే తరఫున ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడు విజయ్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ స్థానాల్లో ఆయన గెలిచారు.
అయితే, నిబంధనల ప్రకారం ఆయన ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో విజయ్ పెరంబూర్‌ను అట్టిపెట్టుకుని తిరుచ్చి ఈస్ట్ స్థానాన్ని వదులుకునే అవకాశాలున్నాయి.
ఇందులో భాగంగా అక్కడ జరగబోయే ఉప ఎన్నికలో టీవీకే అభ్యర్థిగా త్రిష బరిలోకి దిగుతారని తమిళ మీడియా కోడై కూస్తోంది. ఎన్నికల ఫలితాల్లో టీవీకే ఆధిక్యం స్పష్టమవుతున్న సమయంలో నటి త్రిష చెన్నైలోని విజయ్ నివాసానికి చేరుకోవడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.
