సంబంధిత వార్తలు
- కళ్ల క్రింద నల్లటి వలయాలు తగ్గాలంటే ఏమి చేయాలి..
- గూగుల్ మొబైల్ సర్వీసులు లేని ''ఆనర్ వి6'' ట్యాబ్లెట్ విడుదల
- కన్నతల్లిపై నీచానికి ఒడిగట్టిన కుమారుడు.. నగ్న ఫోటోలను వాట్సాప్ గ్రూపులో పెట్టి?
- నేరేడు గింజల పొడిని.. పెరుగుతో కలిపి తీసుకుంటే? (video)
- క్షుద్ర పూజలు చేస్తున్నారని ముగ్గురు మహిళలకు గుండు కొట్టించి, ఆపై?
మహంకాళి మూవీస్, ఆది సాయికుమార్ కాంబోలో వస్తున్న చిత్రం "బ్లాక్"
Black
అయితే ఈ చిత్ర షూటింగ్ 70% పూర్తి చేసుకుంది. మిగతా బ్యాలన్స్ షూటింగ్‌ని లాక్‌డౌన్ తరువాత పూర్తిచేసి విడుదలకి చేయటానికి నిర్మాతలు సన్నాహలు చేస్తున్నారు. ఈరోజు ఈచిత్రం యెక్క టైటిల్‌ని కొన్ని వర్కింగ్ స్టిల్స్ మరియు మేకింగ్‌ని విడుదల చేయటం జరిగింది.
ఈ సందర్బంగా నిర్మాత మహంకాళి దివాకర్ మాట్లాడుతూ.. మహంకాళి మూవీస్ పతాకంపై ఆది సాయి కుమార్ హీరోగా నటిస్తున్న నూతన చిత్రానికి బ్లాక్ అనే టైటిల్ని ఖరారు చేసాము. టైటిల్ తో పాటు ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోని మరియు వర్కింగ్ స్టిల్స్ ను రిలీజ్ చేశాము. ఈ చిత్రానికి ఇప్పటికే భారి అంచనాలు వుండటంతో ఈ మేకింగ్ మరింత క్రేజ్‌ని తీసుకువచ్చింది.
ఎంతో కసిగా సక్సెస్ కోసం చూస్తున్న హీరో ఆదికి గత చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రంలో తన క్యారెక్టర్ డిఫరెంట్ కోణంలో కొత్తగా ఉంటుంది, ఈ చిత్రం ఆది కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలుస్తుంది. భారీ సాంకేతిక విలువలతో నిర్మిస్తున్న ఈ చిత్రం లాక్ డౌన్ తర్వాత బ్యాలెన్స్ వర్క్ శరవేగంగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నాము. ఆది సాయికుమార్ అభిమానుల, సిని ప్రేక్షకుల అంచనాలు అందుకుంటుందని అని నిర్మాత అన్నారు.
నటీనటులు..
హీరోయిన్ - దర్శనా బానిక్, బిగ్ బాస్ కౌశల్, ఆమని, వెన్నెల కిషోర్, శ్యామ్ కృష్ణ, సూర్య, చక్రపాణి, విశ్వేశ్వరరావు, ప్రియదర్శన్ తదితరులు
రచన దర్శకత్వం - జీ.బి కృష్ణ
నిర్మాత - మహంకాళి దివాకర్
కెమెరామెన్ - సతీష్ ముత్యాల
మ్యూజిక్ డైరెక్టర్ - సురేష్ బొబ్బిల
ఎడిటర్ - అమర్ రెడ్డి
ఆర్ట్ డైరెక్టర్ - కె.వి.రమణ
స్టంట్స్ - రామకృష్ణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - శంకర్.
