1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Ajay's Special Movie Trailer

అజయ్ హీరోగా... ఆసక్తి రేపుతున్న 'స్పెషల్' మూవీ ట్రైలర్

Ajay
అజయ్... విలన్‌గానూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ విభిన్నమైన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సంగతి అందరికీ తెలిసిందే. వివిధ సినిమాలలో కీలక పాత్రలు కూడా పోషించి తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ సాగిపోతున్న అజయ్... గతంలో ఒకటి రెండు సినిమాల్లో హీరోగానూ కనిపించినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. తాజాగా ఆయన 'స్పెషల్' సినిమాతో మరోమారు ప్రేక్షకుల ముందుకు హీరోగా రానున్నాడు. అజయ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్న ఈ సినిమాకి వాత్సవ్ దర్శకత్వం వహిస్తున్నారు.
 
కాగా... తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌లో, '93 డేస్ సస్పెన్షన్ తరువాత తిరిగి డ్యూటీలో జాయిన్ అయ్యాను. గత 7 రోజుల్లో నేను చూసిన విషయాలు ఏ పోలీస్ ఆఫీసర్ తన కెరియర్లో చూసుండడు" అంటూ అజయ్ చెప్పిన డైలాగ్ ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉంది. ఈ కథ పూర్తిగా ఒక కేసు విచారణకి సంబంధించిన నేపథ్యంలో సాగుతుందనే విషయం ఈ ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది.
 
త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో... హీరోగా ఈసారి అజయ్ ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి మరి. 
About Writer
వాసు
తర్వాతి కథనం
వైవిఎస్ చౌదరి వద్దన్నా బ్యాంకులో వేసి బౌన్స్ చేశారు... అక్కడ తేల్చుకుంటాం: మోహ‌న్ బాబు