శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (14:46 IST)

వెంకన్నగారూ.. నోరు ఉంది కదాని ఊరికే పారేసుకోకండి : మంచు విష్ణు వార్నింగ్

తన తండ్రి, సినీ నటుడు, వైకాపా నేత మంచు మోహన్ బాబుపై టీడీపీ నేత, ఎమ్మెల్యీ బుద్ధా వెంకన్న చేసిన వ్యాఖ్యలపై సినీ హీరో మంచు విష్ణు ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రిని తిడితే పెద్దవారవుతారని మోహన్ బాబు భావిస్తున్నారని ఇటీవల మండలిలో బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మంచు విష్ణు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. 
 
'వెంకన్నగారూ.. నోరు ఉంది కదాని ఊరికే పారేసుకోకండి. ఎన్నికలు ఉండేది ఇంకో పది రోజులే. ఆ తర్వాత మీరు మా ఇంటికి రావాలి. మేము మీ ఇంటికి రావాలి. ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాలి. ఎన్నికల్లో మీరు విమర్శించొచ్చు.. మేమూ మిమ్మల్ని విమర్శించొచ్చు. కానీ మర్యాద ఉండాలి. అన్నింటికీ హద్దు ఉంటుంది. నెల రోజుల ముందు తిరుపతికి వచ్చి మీరు మా ఇంట్లో కూర్చుని ఏం మాట్లడారో మర్చిపోకండి' అని ట్వీట్ చేశారు.