1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Allu Arjun at the AAA Cinemas Multiplex Pooja

AAA సినిమాస్ మల్టీప్లెక్స్ పూజా కార్యక్రమంలో అల్లు అర్జున్

Hyderabad
Allu arjun
హైద్రాబాద్ సిటీలో మరో మల్టీప్లెక్స్ రానుంది. అమీర్ పేట్‌లో AAA మల్టీప్లెక్స్ రానుంది. సిటీకి లాండ్ మార్క్‌లా ఈ మల్టీప్లెక్స్ ఉండబోతోంది. నారాయణ్ దాస్ నారంగ్, అల్లు అరవింద్, మురళీ మోహన్, ఎన్ సదానంద్ గౌడ్‌ల భాగస్వామ్యంలో ఈ మల్టీప్లెక్స్ నిర్మితమవుతోంది.
 
AAA cinema team
సత్యం థియేటర్‌కు ఉన్న విశిష్టత అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అక్కడే ఇప్పుడు ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం జ‌రుగుతుంది. మాల్‌కు సంబంధించిన నిర్మాణం పూర్తయింది. నేడు మల్టీప్లెక్స్ నిర్మాణం ప్రారంభమైంది. ఈ సంద‌ర్భంగా  పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్ తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ క్లాస్ విజువల్స్, ఆడియో ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకు రాబోతోన్న ఈ మల్టీప్లెక్స్‌ను AAAగా పిలవబోతోన్నారు. హైద్రాబాద్ ప్రజలను ఆకట్టుకునేలా, అలరించేలా ఈ మల్టీ ప్లెక్స్ తయారవుతోంది.
తర్వాతి కథనం
టావీవుడ్‌లో ఒక‌వైపే కాదు - రెండో వైపు కూడా చూడాలి - గాయాలు ఎందుకు జ‌రిగాయి