ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 6 నవంబరు 2021 (12:58 IST)

చిరంజీవి 154కు బాబీ దర్శకత్వం.. మాస్ లుక్ రిలీస్

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా వరుసబెట్టి సినిమాలు చేస్తున్నారు. 'ఆచార్య' షూటింగ్​ ఇప్పటికే పూర్తి చేసిన చిరు.. ‘గాడ్​ఫాదర్’, ‘భోళా శంకర్’ చిత్రాల షూటింగ్ తో బిజీగా ఉన్నారు. 
 
ఇప్పుడు మరో సినిమా షూటింగ్​ మొదలుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న 154వ సినిమా పూజా కార్యక్రమం శనివారం హైదరాబాద్‌ నగరంలో జరిగింది. ఇందులో చిరంజీవి మాస్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. చేస్తారు.
 
చిరంజీవి లైట‌ర్ వెలిగించి సిగ‌రెట్ కాలుస్తున్న‌ట్టు క‌నిపించారు. ఈ పోస్ట‌ర్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పిస్తుంది. బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాకు ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్​ పరిశీలనలో ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్​తో నిర్మిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.
 
ఇదిలావుంటే, మెగాస్టార్‌తో త‌న సినిమా లాంచ్ అయిన నేప‌థ్యంలో బాబీ చేసిన ట్వీట్ ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. 'మెగాస్టార్, ఆయన పేరు వింటే… అంతు లేని ఉత్సాహం! ఆయన పోస్టర్ చూస్తే.. అర్థంకాని ఆరాటం.. తెర మీద ఆయన కనబడితే… ఒళ్ళు తెలీని పూనకం, పద్దెనిమిదేళ్ల క్రితం…. ఆయన్ని మొదటి సారి కలసిన రోజు కన్న కల… నిజమవుతున్న ఈ వేళ మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నాను' అంటూ ట్వీట్ చేశారు.