శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 అక్టోబరు 2021 (21:17 IST)

లావా అగ్ని 5జీ స్మార్ట్​ఫోన్​: ధర రూ. 19,999

lava
లావా అగ్ని 5జీ స్మార్ట్​ఫోన్​ను నవంబర్​ 9న మధ్యాహ్నం 12 గంటలకు ఆవిష్కరించనున్నట్లు సంస్థ తెలిపింది. ఇప్పటికే కంపెనీ తన అధికారిక వెబ్​సైట్​ ద్వారా దీని లాంచింగ్​ను ధ్రువీకరించింది. అయితే లాంచింగ్​కు ముందే దీనికి సంబంధించిన ఫీచర్లు ఆన్​లైన్​లో లీకయ్యాయి. 
 
లీకేజీని బట్టి స్మార్ట్‌ఫోన్ ఫీచర్లను పరిశీలిస్తే.. లావా అగ్ని 5జి స్మార్ట్​ ఫోన్​ పంచ్-హోల్ కటౌట్​ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 5G చిప్‌సెట్​తో పనిచేస్తుంది. ఇది 5,000mAh బ్యాటరీతో వస్తుంది.
 
ఈ స్మార్ట్​ఫోన్​ రూ. 19,999 ధర వద్ద లభించనుంది. ఇది భారతదేశంలో ఇప్పటికే ఉన్న రెడ్​మీ, రియల్​మీ, శామ్​సంగ్ 5జీ స్మార్ట్​ఫోన్లకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రెడ్​మీ నోట్​ 10ఎస్​ స్మార్ట్​ఫోన్​ రూ.15 వేలలోపు అందుబాటులో ఉండగా, రియల్​మీ 8 5జీ రూ. 16 వేల ధరలో లభిస్తుంది. ఇక, శామ్​సంగ్​ 5జీ స్మార్ట్​ఫోన్లు రూ. 20 వేల ప్రారంభ ధర వద్ద లభిస్తున్నాయి.