"B.కాంలో ఫీజిక్స్" ట్రైలర్ విడుదల
B.Com Physics, movie, trailer
చిత్ర దర్శక, నిర్మాత శ్యామ్ జె చైతన్య మాట్లాడుతూ, చెన్నై ఎక్స్ ప్రెస్ కు వర్క్ చేసిన రైటర్ దగ్గర 10 సంవత్సరాలు పనిచేశా. ఎడిటింగ్, డైరక్షన్ ఫీల్డ్ లలో మెళుకువలు నేర్చుకొని కన్నడలో రెండు సినిమాలకు డైరెక్షన్ చేసి ప్రొడ్యూస్ చేశాను. తెలుగులో "ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి", "ఏడు చేపల కథ" సినిమాలు తీశాను. మూడవ సినిమా "B.కాంలో ఫీజిక్స్" కు దర్శకత్వం చేసి నిర్మించడం జరిగింది. అమ్మాయిలపై జరుగుతున్న రేప్ లను అరికట్టడానికి ఈ మధ్య చాలా సినిమాలు వచ్చాయి. రీసెంట్ గా వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్ కూడా అటువంటిదే. ఈ సినిమాలో రేప్ కు గురైన ఒక అమ్మాయి తన పాయింట్ ఆఫ్ వ్యూలో వైల్డ్ గా తీసుకున్న నిర్ణయం ఏమిటనేది ఆసక్తికరం. ఈ కథలో కామెడీని జోడించి ప్రయోగాత్మకంగా చూపించాం. షూటింగ్ పూర్తి చేసుకున్నఈ సినిమా త్వరలో సెన్సార్ కు వెళుతుంది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే లో సినిమాను విడుదల చేస్తామని` అన్నారు.
హీరోయిన్ లో ఒకరైన మేఘన మాట్లాడుతూ, ఇప్పటి వరకు చేయని డిఫ్రెంట్ రోల్ ను ఈ సినిమాలో నటించానని తెలిపారు.
కమెడియన్ అప్పారావు మాట్లాడుతూ, నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు."అవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి"లో చేసిన పాత్రకు మించి ఇందులో నా పాత్ర ఉంటుంది. సున్నితమైన అంశాన్ని దర్శకుడు చక్కగా తెరకెక్కించాడు. ఈ చిత్రం దర్శక,నిర్మాతలకు గొప్ప విజయం సాధించి మరెన్నో చిత్రాలు నిర్మిస్తూ మాలాంటి వారికి అవకాశం కల్పించాలని అన్నారు.
తర్వాతి కథనం
