శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 17 ఏప్రియల్ 2021 (17:42 IST)

మైండ్ గేమ్ నేపథ్యంలో "శుక్ర"

Srijita, Aravind krishna
మైండ్ గేమ్ నేపథ్యంలో అరవింద్ కృష్ణ, శ్రీజితా ఘోష్ జంటగా నటించిన సినిమా‌ "శుక్ర". సుకు పూర్వజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయ్యన్న నాయుడు నల్ల, తేజ పల్లె నిర్మాతలు. నిర్మాణాంత‌ర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న శుక్ర సినిమా ఈనెల 23న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను యూనిట్ తెలియ‌జేసింది.
 
మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, `ఇట్స్ మై లవ్ స్టోరి` చిత్రంతో అరవింద్ కృష్ణను ప‌రిచ‌యం చేశాం. టాలెంట్ ఉన్న నటుడు. చాలా రోజుల గ్యాప్ వచ్చింది అతనికి. ఈ గ్యాప్  తర్వాత మంచి యాక్షన్ ఫిల్మ్ తో మీ ముందుకొస్తున్నాడు. టెక్నికల్ గా చాలా మంచి సినిమాగా పేరు తెచ్చుకుంటుంది. ప‌రిమిత‌ బడ్జెట్ లో చేసిన చిత్రమిది. ఇప్పుడున్న ఛాలెంజింగ్ టైమ్ లో రిలీజ్ అవుతోంది` అన్నారు. 
 
దర్శకుడు సుకు పూర్వజ్ మాట్లాడుతూ, గతంలో ఇండిపెండెంట్ మూవీస్, షార్ట్ ఫిలింస్ చేశాను. వాటికి అంతర్జాతీయ స్థాయిలో అవార్డ్స్ వచ్చాయి. నాకు బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డ్, ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ చేసిన జగదీశ్ బొమ్మిశెట్టికి డీవోపీగా పురస్కారం దక్కాయి. చాలా బౌండ్ స్క్రిప్ట్ లు చేసుకున్న తర్వాత శుక్ర మూవీతో ఫస్ట్ ఫిల్మ్ రూపొందించాను. ప్ర‌స్తుతం టాప్ స్టార్స్ సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. అందుకే  ఈ నెల 23న విడుదల చేసేందుకు ముందడుగు వేశాం. మధుర శ్రీధర్ గారు సినిమా చూసి ఆయనకు నచ్చి రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చారు. నాయిక శ్రీజిత సినిమా కోసం చాలా కష్టపడింది. యూట్యూబ్ లో మా సినిమా ట్రైలర్, పాటలు ఉన్నాయి. మీకు ఏమాత్రం కొత్తగా అనిపించినా థియేటర్కు వచ్చి సినిమా చూడండి. ఓ కొత్త సినిమా చూసిన ఫీలింగ్ తప్పకుండా కలుగుతుంది. అన్నారు.
 
హీరో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ, ఈ సినిమా నాకు నటుడిగా పునర్జన్మ లాంటింది. మధుర శ్రీధర్ మాకు అండగా ఉండకుంటే ఈ సినిమా ఇంత చక్కగా రిలీజ్ అయ్యేది కాదు. పర్సనల్ లైఫ్ తో సినిమాలకు కొంత దూరంగా ఉన్నాను. ప్రొఫెషనల్ బాస్కెట్ బాల్ ప్లేయర్ గా అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నాను. దాంతో నటనకు కొంత దూరం అవ్వాల్సి వచ్చింది. నాలుగేళ్ల కిందట దర్శకుడు సుకుతో పరిచయం ఏర్పడింది.  ఈ క‌థ విన‌గానే నేను మళ్లీ నటించాలనే కోరికను కలిగించింది. ఇకపై వరుసగా సినిమాలు చేయాలని ఉంది. శుక్ర ఒక న్యూ ఏజ్ మూవీ. ఈ మధ్య కాలంలో ఓటీటీల వల్ల తెలుగు ప్రేక్షకులకు వరల్డ్ సినిమా బాగా పరిచయం అయ్యింది. ప్రేక్షకులకు కొత్త టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ కావాలని కోరుకుంటున్నారు. తెలుగు సినిమా స్టాండర్డ్ ప్రపంచస్థాయికి పెరిగింది. ఇలాంటి టైమ్ లో నేను తెలుగు సినిమా హీరో అని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాను అని అన్నారు.
 
నిర్మాత తేజ పల్లె, నాయిక శ్రీజిత ఘోష్‌, సినిమాటోగ్రాఫర్ జగదీశ్ బొమ్మిశెట్టి మాట్లాడుతూ,  ప్రతి ఒక్కరూ ఒకరకంగా సినిమాకు నిర్మాతలే అనుకోవచ్చు. వాళ్లంతా చాలా సాక్రిఫైజ్ చేసి సినిమా కంప్లీట్ అయ్యేలా చేశారు. ఏడాదిన్నరగా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని సినిమాను పూర్తి చేశాం. సినిమా అనుకున్నట్లు వచ్చింది. మీరు చూసి బ్లెస్ చేయాలి. అన్నారు.