శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 17 ఏప్రియల్ 2021 (17:21 IST)

23న వ‌స్తోన్న స‌స్పెన్స్ థ్రిల్లర్ `కథానిక`

Kathanika still
మనోజ్ నందన్, నైనీషా, సాగర్, సరితా పాండా హీరో హీరోయిన్లుగా న‌టించిన `కథానిక` సినిమా ఈనెల 23 విడుద‌ల చేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. జగదీష్ దుగన దర్శకత్వంలో ప‌ద్మ లెంక నిర్మిస్తున్న చిత్రమిది. రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్యతారాగణంతో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెర‌కెక్కింది.
 
సినిమా గురించి నిర్మాత రామ రావు లెంక, పద్మ లెంక మాట్లాడుతూ "మేము ఈ చిత్రాన్ని కరోనా టైంలో షూటింగ్ చేశాం. మా చిత్ర నటీనటులు, టెక్నీషియన్ అందరు బాగా సహకరించారు. సినిమా బాగా వచ్చింది. మా డైరెక్టర్ జగదీష్ దుగన అద్భుతంగా చిత్రీకరించారని తెలిపారు. 
 
దర్శకుడు జగదీష్ దుగన మాట్లాడుతూ "మా కథానిక చిత్రం ఒక సస్పెన్స్ థ్రిల్లర్. కథ చాలా కొత్తగా ఉంటుంది. ఇప్పటివరకు తెలుగు తెర మీదకి ఈ కథ రాలేదు. మ్యూజిక్, లొకేషన్స్ ప్రతిదీ అద్భుతంగా ఉంటుంది. ఏప్రిల్ 23 న విడుదల అవుతుంది. అందరు చూసి నన్ను ఆశీర్వదించండి" అని తెలిపారు. 
 
హీరో సాగర్ మాట్లాడుతూ "ఇది నా మొదటి సినిమా. కరోనా టైంలో ఈ చిత్రం లో నాకు అవకాశం వచ్చింది. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్, ఫామిలీ మొత్తం కలిసి చూసే సినిమా. ఏప్రిల్ 23న విడుదల అవుతుంది" అని తెలిపారు. 
జ‌బ‌ర్‌ద‌స్త్ ఫేమ్ షేకింగ్ శేషు, హీరోయిన్ నైనీషా మాట్లాడుతూ, ఈ చిత్రం విజ‌య‌వంతం కావాల‌ని ఆకాంక్షించారు. కెమెరా : హరినాథ్ దేవర, స్టోరీ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, లిరిక్స్, మాటలు, దర్శకత్వం: జగదీష్ దుగన.