ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2021
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 ఏప్రియల్ 2021 (16:45 IST)

''వాతీ కమింగ్'' పాటకు భుజం కదిపిన బ్రావో.. పడిపడి నవ్విన రాయుడు (Video)

Bravo
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన మాస్టర్ సినిమా ఇంట్రో సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ''వాతీ కమింగ్'' అనే ఈ పాట భారీ వ్యూస్ సంపాదించింది. ఆ సాంగ్‌లోని లిరిక్స్‌, డ్యాన్స్‌ స్టెప్పులను చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ అనుకరిస్తున్నారు. భుజం కదుపుతూ విజయ్‌ చేసిన మూమెంట్‌కు విశేషాదరణ లభించింది. తాజాగా ఇదే పాటలోని ఓ స్టెప్పుకు చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో భుజం కదిపాడు. 
 
శుక్రవారం పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో వికెట్‌ తీసిన ఆనందంలో చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో 'వాతీ కమింగ్' డ్యాన్స్‌ చేసి అలరించాడు. మైదానంలో బ్రావో స్టెప్పులకు పక్కనే ఉన్న అంబటి రాయుడు పడిపడి నవ్వుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఐపీఎల్‌ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాళ్లతో పాటు చాలా మంది క్రికెటర్లు ఈ పాటకు డ్యాన్స్‌ చేశారు.