ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 27 ఏప్రియల్ 2017 (02:52 IST)

ఎడారి దేశంలో బాహుబలి-2 తుఫాన్.. హాలీవుడ్ చిత్రాలను బీట్ చేసిన బుకింగ్స్ రికార్డ్

ప్రపంచ సినిమా చరిత్రలో హాలీవుడ్ చిత్ర పరిశ్రమనే షేక్ చేసిన బాహుబలి-2 తనకు ఆకాశం కూడా హద్దు కాదనేంత రేంజ్‌లో దూసుకు పోతోంది. చరిత్రలో ఏ భారతీయ సినిమాకూ ఇక సాధ్యం కాదన్నంత రికార్డుల జోరులో తడిసి ముద్దవుతోందీ చిత్రం. భారతీయ దార్శనికత, దేశీయ సాంస్కృతిక మ

ప్రపంచ సినిమా చరిత్రలో హాలీవుడ్ చిత్ర పరిశ్రమనే షేక్ చేసిన బాహుబలి-2 తనకు ఆకాశం కూడా హద్దు కాదనేంత రేంజ్‌లో దూసుకు పోతోంది. చరిత్రలో ఏ భారతీయ సినిమాకూ ఇక సాధ్యం కాదన్నంత రికార్డుల జోరులో తడిసి ముద్దవుతోందీ చిత్రం. భారతీయ దార్శనికత, దేశీయ సాంస్కృతిక మనోద్వేగాలను శిఖర స్థాయికి తీసుకుపోయిన బాహుబలి-2  అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లలో కూడా అనితర సాధ్యమైన రికార్డును సాధించేసింది.
 
గల్ఫ్ దేశాల్లో భారీగా రిలీజ్ అవుతున్న బాహుబలి, అడ్వాన్స్ బుకింగ్స్‌లో కొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఈ విషయాన్ని బాహుబలి గల్ఫ్ డిస్ట్రిబ్యూటర్ ఫార్స్ ఫిలిమ్స్ అధినేత గులాన్ స్వయంగా వెల్లడించాడు. ఇప్పటికే బాహుబలి 2కు సంబంధించి లక్షకు పైగా టికెట్లు అమ్ముడైనట్టుగా ప్రకటించారు. హాలీవుడ్ రీసెంట్ సూపర్ హిట్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 8కు కూడా ఈ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదని వెల్లడించారు. ఇటీవలే బాహుబలి టీం దుబాయ్‌లో సినిమా ప్రమోషన్ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకుంది. 
 
ఈ శుక్రవారం రిలీజ్‌కు రెడీ అవుతున్న బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు నమోదు చేస్తోంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్‌లో సరికొత్త రికార్డ్ సెట్ చేసిన బాహుబలి అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ అదే జోరు చూపిస్తోంది. కేవలం ఇండియాలోనే కాదు, ఓవర్ సీస్‌లోనూ బాహుబలి అడ్వాన్స్ బుకింగ్స్ సరికొత్త రికార్డ్‌లు నమోదు చేస్తున్నాయి. పలు హాలీవుడ్ చిత్రాలను కూడా వెనక్కి నెట్టి బాహుబలి సత్తాచాటుతోంది.