సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 సెప్టెంబరు 2023 (08:27 IST)

మాజీ కోడలు సమంత గురించి వాకబు చేసిన నాగార్జున.. బిగ్ బాస్-7వ సీజన్ ప్రారంభం

biggboss season 7
టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించే బిగ్ బాస్ ఏడో సీజన్ అట్టహాసంగా మొదలైంది. ఈ రియాలిటీ షోలో పాల్గొనే వారందరినీ బిగ్ బాస్ హౌస్‌‍లోకి పంపించి లాక్ చౌశారు. మొత్తం 14 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ ఏడో సీజన్ ప్రారంభోత్సవానికి వచ్చిన హీరో విజయ్ దేవరకొండ వద్ద తన మాజీ కోడలు, హీరోయిన్ సమంత గురించి హీరో నాగార్జున వాకబు చేశారు. 
 
ఇపుడు సమంత ఎక్కడుంది అంటూ విజయ్ దేవరకొండను నాగార్జున అడగ్గా.. ఆమె అమెరికాలో ఉందని విజయ్ దేవరకొండ బదులిచ్చారు. ఆమె అనారోగ్యానికి చికిత్స చేయించుకుంటోందని విజయ్ దేవరకొండ వెల్లడించారు. "ఖుషి'' చిత్రంలో ఎవరు ఎవరిని డామినేట్ చేశారని నాగ్ ప్రశ్నించగా, భార్యను ఎప్పుడూ భర్త డామినేట్ చేయలేడని విజయ్ దేవరకొండ బదులిచ్చారు. అనంతరం, విజయ్ దేవరకొండను నాగ్ బిగ్ బాస్ ఇంట్లోకి పంపి, కంటెస్టెంట్లకు ఫర్నిచర్ అందించే టాస్క్‌ను నిర్వహించారు. 
 
ఇదిలావుండగా, వినోదపు అడ్డాగా గుర్తింపు పొందిన బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్‌‍ను ప్రేక్షకులను ఆలరించేందుకు వచ్చేసింది. గత కొన్ని సీజన్లుగా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జున ఈ సీజన్‌కు కూడా హోస్ట్‌గా కొనసాగనున్నారు. ఇక, తొలి కంటెస్టెంట్‌గా టీవీ నటి ప్రియాంక జైన్ బిగ్ బాస్ ఇంట్లోకి ప్రవేశించింది. కొత్త సీజన్ కావడంతో ఇంటి సెట్టింగ్ కూడా కొత్తగా ఉంది. గత సీజన్లతో పోల్చితే ఈసారి బిగ్ బాస్ హౌస్ ఎక్స్‌టీరియర్స్, ఇంటీరియర్స్ పూర్తిగా మార్చేశారు. కలర్‌ఫుల్‌గా, రిచ్‌నెస్ ఉట్టిపడేలా బిగ్ బాస్ ఇంటిని తీర్చిదిద్దారు.
 
అయితే ఫర్నిచర్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఎందుకో నాగార్జున వివరణ ఇచ్చారు. బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లే కంటెస్టెంట్లు కొన్ని టాస్క్‌ల ద్వారా బిగ్ బాస్ ఇంటికి అవసరమైన ఫర్నిచర్‌ను సంపాదించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ప్రోమోలో చెప్పినట్టుగానే ఉల్టా పుల్లా ఖాయమని బిగ్ బాస్ ప్రారంభ ఎపిసోడ్ చెబుతోంది.