గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 17 మే 2023 (19:18 IST)

అన్నపూర్ణ స్టూడియోస్‌, క్యూబ్‌ సినిమా స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్ వర్చువల్‌ ప్రొడక్షన్‌ స్టేజ్‌

Akkineni Nagarjuna, Panchapakesan
Akkineni Nagarjuna, Panchapakesan
ఇండియన్‌ మీడియా బిజినెస్‌లో దిగ్గజాలు అన్నపూర్ణ స్టూడియోస్‌, క్యూబ్‌ సినిమా. ఈ రెండు సంస్థలూ సంయుక్తంగా హైదరాబాద్‌లో ది ఎ ఎన్నార్‌ వర్చువల్‌ ప్రొడక్షన్‌ స్టేజ్‌ని ఏర్పాటు  చేశాయి. స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్ ఐసీవీఎఫ్‌ఎక్స్ (ఇన్‌ కెమెరా విజువల్‌ ఎఫెక్ట్స్ ) వల్ల ఫిల్మ్ మేకర్స్ ప్రొడక్షన్‌ ప్రాసెస్‌ని సులభతరం చేయడానికి వీలవుతుంది. ఎఎన్నార్‌ వర్చువల్‌ ప్రొడక్షన్‌ స్టేజ్‌ ఈ విషయం మీద 2022 అక్టోబర్‌ నుంచి రకరకాల ప్రయోగాలు  చేస్తోంది. ఇప్పటికే కొన్ని సినిమాలు, యాడ్స్, మ్యూజిక్‌ వీడియోలను కూడా షూట్‌  చేసింది.
 
వాటన్నిటినీ పరిశీలించాకే వర్క్ ఫ్లో సొల్యూషన్‌ నాణ్యత బావుందని ఫిల్మ్ మేకర్స్ కి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎలాంటి హద్దులూ లేకుండా ఫిల్మ్ మేకర్స్ తమ క్రియేటివ్‌ గోల్స్ అచీవ్‌ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. కటింగ్‌ ఎడ్జ్, హై బ్రైట్‌నెస్‌, 60 అడుగుల వెడల్పు, 20 అడుగులు ఎత్తు , 2.3 మిల్లీ మీటర్ల డాట్‌ పిచ్ (అల్ట్రా హై రెఫ్రెష్‌ రేట్‌, వైడ్‌ కలర్‌ గమట్‌)  ఉన్న ఎల్‌ఈడీ వాల్‌ స్పాన్నింగ్‌ అందులో ఉంటాయి. వాటన్నిటికీ మించి ఆటో లెడ్‌ డిస్‌ప్లేలుంటాయి. రెడ్‌స్పై, పవర్‌ఫుల్‌ కస్టమ్‌ బిల్ట్ రెండరింగ్‌ సిస్టమ్స్, అన్‌రియల్‌ ఇంజిన్‌తో  కాంప్లెక్స్ ఫొటో రియలిస్టిక్‌ వర్చువల్‌ లొకేషన్స్ ని రియల్‌ టైమ్‌ రెండరింగ్‌ చేయడం వంటివన్నీ అద్భుతమైన అంశాలు.
 
వీటన్నిటినీ ఉపయోగించుకుని రియల్‌, వర్చువల్‌ ఎలిమెంట్స్ బ్లెండ్‌ చేసి ప్రపంచంలోని ఎలాంటి ప్రదేశానికైనా ఫిజికల్‌గా వెళ్లకుండా షూటింగ్‌ చేసుకోవచ్చు. తమ సృజనకు అనుగుణంగా వాతావరణాన్ని, లైటింగ్‌ని మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది.
 
  మీడియా, ఫిల్మ్‌ ఇండస్ట్రీకి అనుకూలమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, సేవలు అందించడంలో ఎప్పుడూ ముందుంటుంది అన్నపూర్ణ స్టూడియోస్‌. సాంప్రదాయబద్ధమైన సినిమా స్టూడియోగా మొదలై, ప్రొడక్షన్‌ హౌస్‌తో విస్తరించిన ఈ సంస్థ ప్రస్తుతం ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్ స్టూడియో ఏర్పాటు  చేసి వ్యక్తిగతమైన సేవలను అన్నీ హంగులతోనూ ముందుంచుతోంది. మీడియా ఇండస్ట్రీలో తరాలుగా సేవలందిస్తోంది అన్నపూర్ణ బ్రాండ్‌. ప్రొడక్షన్‌, డిస్ట్రిబ్యూషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగాల్లోనే కాదు, ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీలు అందిపుచ్చుకుంటూ, బిజినెస్‌ మోడల్స్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో గత మూడు దశాబ్దాలుగా క్యూబ్‌ సినిమా ప్రస్థానం చెప్పుకోదగ్గది. ఎప్పటికప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ప్రొడక్షన్‌, పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు సునాయాసంగా జరగడానికి తనవంతు దోహదపడుతోంది.
 
అన్నపూర్ణ స్టూడియోస్‌, క్యూబ్‌ చేయీ చేయీ కలిపి మొదలుపెట్టిన ఈ తాజా ప్రయాణం మెచ్చుకోదగ్గ వినోదాత్మక పర్యావరణానికి, వర్చువల్‌ ప్రొడక్షన్‌కి ఎంతగానో దోహదపడుతుంది. కంటెంట్‌ ప్రొడక్షన్‌లో మరో ఆసక్తికరమైన మజిలీని చూడనుంది. ''మా వినియోగదారులకు కట్టింగ్‌ ఎడ్జి సర్వీసులు అందించడానికి ఏఎన్నార్‌ వర్చువల్‌ ప్రొడక్షన్‌ స్టేజ్‌ తనవంతు కృషి చేస్తుంది'' అని అన్నారు అన్నపూర్ణ స్టూడియోస్‌ అక్కినేని నాగార్జున. ''సినిమాల నిర్మాణంలో మా బలం, మా అనుభవంతో పాటు సాంకేతిక పరిజ్ఞానంలో క్యూకున్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని మేం చేతులు కలిపాం. సృజనాత్మక రంగంలో ఎలాంటి సరిహద్దులు లేకుండా తెరమీద ఆవిష్కరించడానికి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నాం'' అని చెప్పారు.

''అన్నపూర్ణ స్టూడియోతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. మన దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ ఉన్న ఫిల్మ్ మేకర్స్ కోసం మేం ఈ అత్యాధునిక టెక్నాలజీని పరిచయం చేస్తున్నాం'' అని అన్నారు. క్యూబ్‌ సినిమా కో ఫౌండర్‌ పంచపకేశన్‌.  ''కంటెంట్‌ ప్రొడక్షన్‌లో ఇది కొత్త యుగం. ఫిల్మ్ మేకర్స్ కి అత్యంత అనువైన, హైలీ ఎఫిషియంట్‌, కాస్ట్ ఎఫెక్టివ్‌ మేనర్‌లో మేం ఈ వెసులుబాటు తీసుకొస్తున్నాం. కంటెంట్‌ ప్రొడక్షన్‌లో వర్చువల్‌ ప్రొడక్షన్‌ అనేది అత్యంత ప్రశంసనీయమైన అభ్యున్నతి. ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానంలో మేం ముందంజలో ఉండటం చాలా ఆనందంగా ఉంది'' అని అన్నారు.