1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Brahmana Movie

హీరోయిన్ ఎద పైన నాగుపాము... చేత్తో పట్టేసిన ఉపేంద్ర... అతడి రూటే సెపరేటు...

సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో రాయలసీమ మనిషిగా నటించిన ఉపేంద్ర నటన చాలా డిఫరెంటుగా ఉంటుంది. ఏదైనా వెరైటీగా చేయడం ఈ హీరో నైజం. సినిమా నటన గురించి, ఆయన చిత్రాల్లోకి ఎందుకు వచ్చారో చెప్పడం గురించి తెలుసుకుంటుంటే కాస్త విచిత్రంగానే ఉంటుంది. ఎందుకంటే ఆయన చెప

Brahmana Movie
సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో రాయలసీమ మనిషిగా నటించిన ఉపేంద్ర నటన చాలా డిఫరెంటుగా ఉంటుంది. ఏదైనా వెరైటీగా చేయడం ఈ హీరో నైజం. సినిమా నటన గురించి, ఆయన చిత్రాల్లోకి ఎందుకు వచ్చారో చెప్పడం గురించి తెలుసుకుంటుంటే కాస్త విచిత్రంగానే ఉంటుంది. ఎందుకంటే ఆయన చెప్పే ఫిలాసఫి ఓ పట్టాన అర్థంకాదు మరి. ఇదిలావుంటే తాజాగా ఈ హీరో బ్రాహ్మణ అనే చిత్రంతో వస్తున్నాడు. ఇది ఓ సామాజిక వర్గానికి చెందిన పేరు కావడంతో దీనిపై ఎలాంటి దుమారం రేగుతుందోనని అప్పుడే చర్చలు మొదలయ్యాయి. 
 
ఇదిలావుంటే ఈ చిత్రంలో తన సరసన రాగిణి ద్వివేది, సలోని నటించారు. చెప్పాలంటే అందాలు ఆరబోయడానికి ఈ చిత్రంలో వారు నటించినట్లు చెప్పుకుంటున్నారు. చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్ ఇటీవలే విడుదల చేశారు. ఈ ట్రెయిలర్లో ఓ సన్నివేశంలో ఉపేంద్ర హీరోయిన్ ఎదపై నాగుపాము టాటూ ఉంటే... దాన్ని పట్టుకుంటాడు. ఇప్పుడు ఇది చాలా హాట్ టాపిక్ అయ్యింది. మరీ హీరో అక్కడ పట్టుకోవడమేమిటంటూ చర్చ మొదలైంది. అందుకే కదా ఉపేంద్ర అలా పట్టుకుందీ అని మరికొందరంటున్నారు. మరి చిత్రం విడుదలయ్యాక ఎలాంటి సిత్రాలు చూడాల్సి వస్తుందో వెయిట్ అండ్ సీ.
About Writer
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి
తర్వాతి కథనం
అనుష్కపై రాజమౌళి అరిచారా...? ఎందుకని..?