సంబంధిత వార్తలు
- బ్యాట్ గురి తప్పింది.. 'జెర్సీ' నానికి అక్కడ బంతి తగిలింది... షూటింగ్లో గాయాలు...
- పాపం 'మిస్టర్ మజ్ను'... సిక్స్ ప్యాక్ చూపించినా...
- నా పక్కన నిధి అగర్వాల్ అయితే బాగుంటుంది..? పూరీతో ‘ఇస్మార్ట్ శంకర్'
- కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంక్రాంతి అల్లుళ్ళు (ఎఫ్2 16 డేస్ రిపోర్ట్)
- సప్తగిరి హీరోగా ‘వజ్ర కవచధర గోవింద’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
'చీకటి గదిలో చితక్కొట్టుడు' - మూవీ టైటిల్ సాంగ్ రిలీజ్ (Video)
మిర్చి హేమంత్, థిత్ అరుణ్, భాగ్యశ్రీ మోటే, నిక్కీ టంబోలీ ప్రధాన పాత్రల్లో బ్లూఘోస్ట్ పిక్చర్స్ నిర్మిస్తున్న తాజా చిత్రం 'చీకటి గదిలో చితక్కొట్టుడు'. ఈ చిత్రానికి సంతోష్ పి.జయకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 'చీకటి గదిలో చితక్కొట్టుడు' అనే టైటిల్ ఖరారు చేశారు.
ఇటీవల ఈ చిత్రం టీజర్ విడుదల చేయగా, దానికి అనూహ్య స్పందన వచ్చింది. ఈ టీజర్‌ను చూసిన ప్రతి ఒక్కరూ షాక్‌కు గురయ్యారు. టీజరే ఇంత బోల్డ్‌గా ఉంటే.. సినిమా ఇక ఏవిధంగా ఉంటుందోనని ఊహించుకున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇపుడు టైటిల్ సాంగ్ లిరిక్స్‌ను రిలీజ్ చేశారు. 'హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం, ఇవాళ నేను తయారు చెయ్యబోయే రెసిపీ పేరు, ఆంథెమ్ ఆఫ్ పోర్న్' అని ఒక ఫిమేల్ వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ అవుతుంది.
యూత్ మైండ్ సెట్‌ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఊపునిచ్చే లిరిక్స్‌ని కృష్ణకాంత్ రాయగా, నివాస్, యాజిన్ నిజార్, విష్ణుప్రియ రావి ఈ పాటను ఆలపించారు. బాలమురళి బాలు ఈ సినిమాకి సంగీతమందిస్తున్నాడు. మొత్తంమీద ఈ చిత్రం టీజర్‌తో పాటు టైటిల్ సాంగ్‌కు అద్ఫుత రెస్పాన్స్ వస్తోంది.
తర్వాతి కథనం
