సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : బుధవారం, 30 జనవరి 2019 (12:20 IST)

జూనియర్ పవర్ స్టార్... అకీరా స్టైలిష్ లుక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఆయన సినిమా మొదలైనప్పటి నుండే హైప్ ఉంటుంది, ప్రేక్షకులు కూడా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తుంటారు. కొన్ని సినిమాలైతే బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించాయి. కాగా, రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత సినిమాలు చేసే తీరిక లేకపోవడంతో సినీ అభిమానులు పవన్‌ను బాగా మిస్ అవుతున్నారనే చెప్పాలి.
 
తాజాగా పవన్ కళ్యాణ్ కొడుకు అఖిరానందన్ స్టైలిష్‌గా కనిపిస్తున్న ఫోటో ఒకటి నెట్‌లో హల్‌చల్ చేస్తుండటంతో దీనిని చూసిన వారంతా పవన్ వారసుడొచ్చాడంటూ సంబరపడిపోతున్నారు. 
 
పవన్ కళ్యాణ్ విజయవాడలో కొత్త ఇల్లు కొన్నప్పుడు తన కొడుకు, మూడో భార్య అన్నా లెజ్నోవాతో కలిసి ఉన్న ఫోటోలు సామాజిక మీడియాలో రాగా, వాటిలో అకీరా పవన్ కళ్యాణ్‌ని మించి హైట్ ఉండటంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆరడుగుల హైట్‌తో, అదిరిపోయే స్టైలిష్ లుక్‌తో ఉన్న కొణిదెల వారసుడి ఆరంగేట్రం ఎప్పుడు ఉండబోతోందా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు.