ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 1 నవంబరు 2018 (15:36 IST)

కొత్త లుక్‌లో ఇల్లిబేబి .. ట్రిపుల్ "ఏ"కు ప్లస్ అవుతుందా?

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం 'అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని'. ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రవితేజ త్రిపాత్రాభినయం చేస్తున్నట్టు ఫిల్మ్ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో ఇలియానా క‌థానాయిక‌గా న‌టిస్తోంది. 
 
కాగా ఈ గురువారం ఇలియానా బ‌ర్త్ డే సంద‌ర్భంగా అమ్మ‌డి పోస్ట‌ర్‌ను చిత్ర‌బృందం విడుద‌ల చేశారు. కొత్త హెయిర్ స్టైల్‌తో చాలా కొత్త మేకోవర్‌తో ఇలియానా ఈ పోస్టర్‌లో కనిపిస్తోంది. తప్పకుండా ఇలియానా ఈ సినిమాకు ప్లస్ అవుతుందనే టాక్ వినిపిస్తుంది. 
 
నిజానికి ఈ చిత్రంలో మొదట అను ఇమాన్యూల్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఆ తర్వాత ఇతర కారణాల వల్ల సినిమా నుంచి అనును తొలగించి ఇల్లిబేబిని ఎంపిక చేయడం జరిగింది.