సంబంధిత వార్తలు
- మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర తాజా అప్ డేట్ - షూటింగ్ స్పాట్ నుంచే టీజర్ విడుదల
- భారతీయులందరికీ ఇది బాధాకరమైన రోజు- చిరంజీవి
- చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్న విశ్వంభర అప్ డేట్
- హారర్ థ్రిల్లర్ గా ది రాజా సాబ్ ఏప్రిల్ 10న రాబోతుందన్న డైరెక్టర్ మారుతి
- ఏపీలో చిరు కుటుంబానికి వైకాపా.. తెలంగాణలో నాగ్ ఫ్యామిలీని బజారుకీడ్చిన కాంగ్రెస్?
నేడు చిరంజీవి "విశ్వంభర" మూవీ టీజర్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "విశ్వంభర". ఈ చిత్రం బృందం కీలక సమాచారాన్ని వెల్లడించింది. విజయదశమి పండుగను పురస్కరించుకుని శనివారం "విశ్వంభర" చిత్రం టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. శనివారం ఉదయం 10.49 గంటలకు ఈ టీజర్‌ను రిలీజ్ చేస్తామని దర్శకుడు వశిష్ట సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు.
"విశ్వంభర" చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన త్రిష హీరోయిన్‌గా నటించగా, యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణం సంగీతం అందిస్తున్నారు.
కాగా, ఈ చిత్రం మ్యూజిక్ సిట్టింగ్‌కు చిరంజీవి కూడా హాజరవడం తెలిసిందే. చిరు తనకు బాగా నచ్చిన బాణీలను ఎంపిక చేసుకుని సాంగ్స్ చేయించుకుంటున్నారు. గతంలో చిరంజీవి - కీరవాణి కాంబోలో వచ్చిన "ఘరానా మొగుడు" ఎంత పెద్ద మ్యూజికల్ మ్యూజికల్ హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
తర్వాతి కథనం
