బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 9 అక్టోబరు 2024 (17:35 IST)

చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్న విశ్వంభర అప్ డేట్

Viswambhara
Viswambhara
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా సినిమా విశ్వంభర. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో జరుగుతుంది. కొద్దికాలం గేప్ తీసుకుని మరలా షూట్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి తాజా అప్ డేట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే అందుకు చిరంజీవి పర్మిషన్ వుండాలని చిత్ర యూనిట్ చెబుతోంది.  సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని సందేహం చాలా మందిలో వుంది. ఇప్పటికే సోషియో ఫాంటసీ కథలు రకరకాలుగా పలువురు హీరోల చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.
 
అందుకే అభిమానులు ఊహించని విధంగా అప్ డేట్ ఇవ్వాలని చిరంజీవి సూచించినట్లు తెలుస్తోంది. ఈనెల 12వ తేదీ అప్ డేట్ రాబోతుందని తెలుస్తోంది. కానీ ఈ చిత్రంలో కొన్ని రీష్యూట్ లు జరిపినట్లు తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా  సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఆగస్టు 22న ఓ టీజర్ వస్తుందని అందరూ భావించినా  టీజర్ కట్ పర్ఫెక్ట్‌గా లేకపోవడంతో ఓ పోస్టర్‌తోనే అభిమానులకు ట్రీట్ ఇచ్చారు. కనుకనే దసరాకైనా టీజర్ ట్రీట్ వుంటుందనే అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని సినీవర్గాలు తెలియజేస్తున్నాయి. దసరాకు అప్ డేట్ వస్తుందో లేదో చూడాల్సిందే.