ఆదివారం, 3 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 7 అక్టోబరు 2024 (18:08 IST)

హారర్ థ్రిల్లర్ గా ది రాజా సాబ్ ఏప్రిల్ 10న రాబోతుందన్న డైరెక్టర్ మారుతి

Raja sab- maruti
Raja sab- maruti
తెలుగు ఆడియెన్స్ పల్స్ తెలిసిన దర్శకుడు మారుతి...ఈ మాట చెప్పింది సాక్షాత్తూ మెగాస్టార్ చిరంజీవి. సరదా సన్నివేశాలు, ఫ్యామిలీ ఎమోషన్స్, చక్కటి హీరోయిజం కలిపి మన తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన సినిమాలను అందిస్తున్న డైరెక్టర్ మారుతి రోజు రోజుకూ దర్శకుడిగా ఎదుగుతున్నాడు తన స్థాయిని పెంచుకుంటున్నాడు అంటూ చిరంజీవి గారు గతంలో మారుతిని ప్రశంసించారు.

డైరెక్టర్ మారుతి గురించి మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పిన మాటలు అక్షర సత్యాలు. రేపు , (అక్టోబర్ 8 న )దర్శకుడు మారుతి పుట్టినరోజు సందర్భంగా బెస్ట్ విశెస్ అందిస్తూ ఆయన కెరీర్ విశేషాలు ఒకసారి చూస్తే..
 
ఈ రోజుల్లో అనే చిన్న చిత్రంతో దర్శకుడిగా తన ప్రయాణం మొదలుపెట్టి ఈరోజు రెబెల్ స్టార్ ప్రభాస్ తో భారీ పాన్ ఇండియా మూవీ రాజా సాబ్ తెరకెక్కించే స్థాయికి వెళ్లారు మారుతి. ఆయన దర్శకుడిగా ఎదిగిన తీరు చిత్ర పరిశ్రమలోని ప్రతి కొత్త దర్శకుడికి స్ఫూర్తికరం.
 
సినిమా మీద ప్యాషన్ తో డిస్ట్రిబ్యూటర్ గా జర్నీ స్టార్ట్ చేశారు మారుతి. మంచి రచన చేయగల సామర్థ్యం ఉన్న మారుతి ప్రేక్షకులకు ఒక మంచిని చెబుతూనే థియేటర్స్ కు వారిని ఆకర్షించగల కమర్షియల్ మీటర్  లో స్టోరీలు రెడీ చేసుకున్నారు. అలా గుడ్ సినిమా గ్రూప్ ను తన మిత్రులతో కలిసి స్థాపించి యూత్ ఫుల్ లవ్ స్టోరీగా ఈరోజుల్లో తెరకెక్కించారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి, చిన్న చిత్రాల్లో పెద్ద సక్సెస్ ను అందుకుంది. అక్కడి నుంచి డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా మారుతి ప్రస్థానం మొదలైంది. బస్ స్టాప్, ప్రేమ కథా చిత్రమ్, భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతి రోజు పండగే వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో  స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు మారుతి. మారుతి సినిమా అంటే అటు ప్రొడ్యూసర్స్ ఇటు ఆడియెన్స్ అది ఖచ్చితంగా మంచి మూవీనే అవుతుంది అనేంత నమ్మకాన్ని ఇచ్చారీ టాలెంటెడ్ డైరెక్టర్. సకుటుంబంగా ప్రేక్షకులు చూసే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ రూపొందిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరయ్యారు డైరెక్టర్ మారుతి. మరోవైపు మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై తన మిత్రుడు ఎస్ కేఎన్ తో కలిసి సక్సెస్ ఫుల్ సినిమాలు నిర్మిస్తున్నారు.
 
ప్రస్తుతం రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ పాన్ ఇండియా మూవీ ది రాజా సాబ్ రూపొందిస్తున్నారు మారుతి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా హారర్ థ్రిల్లర్ గా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న థియేటర్స్ లోకి రాబోతోంది. ది రాజా సాబ్ సినిమాతో దర్శకుడిగా మారుతి మరింత గొప్ప స్థాయికి వెళ్లనున్నారు.