సంబంధిత వార్తలు
హీరోయిన్‌కు షాక్ ఇచ్చిన మహాన్ టీమ్: ఏమైందంటే?
vani bhojan
ప్రముఖ తమిళ చలనచిత్ర, టెలివిజన్ నటిని ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం ఎంచుకున్నారు మేకర్స్. కానీ ఏదో కారణాల చేత ఆమె పాత్రను సినిమా నుండి మేకర్స్ తొలగించాలని నిర్ణయించుకున్నారట. సినిమా రన్‌టైమ్ సమస్య కావచ్చు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు ఈ హీరోయిన్ "మహాన్-2"వ భాగంలో ఉండే అవకాశం ఉందంటున్నారు.
ఇప్పటికే మూవీ దాదాపు 2 గంటల 42 నిమిషాల రన్‌టైమ్‌తో సాగింది. వాణి పాత్రను కూడా చేర్చితే నిడివి దాదాపు మూడు గంటలు ఉండేది. బహుశా ఆమె పాత్రను కత్తిరించాలని టీమ్ నిర్ణయించుకోవడానికి అదే కారణం కావచ్చునని సినీ పండితులు అంటున్నారు
