శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 ఫిబ్రవరి 2022 (09:35 IST)

31వ సినిమా: షూటింగ్‌లో తీవ్రంగా గాయపడిన విశాల్

కరోనా వైరస్ కారణంగా చాలా సినిమాల షూటింగ్‌లు ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే కొన్ని సినిమాల షూటింగ్‌లు జరుగుతున్నాయి. తాజాగా తమిళ హీరో విశాల్ ఇప్పుడు తన 31వ సినిమా ‘నాట్ ఏ కామన్ మ్యాన్’ షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. ఈ షూటింగ్‌లో హీరో విశాల్ గాయపడ్డాడు.
 
ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గోడ తగలడంతో విశాల్ వెన్నుకు బలమైన గాయం అయింది. ప్రస్తుతం వైద్యులు చికిత్స చేస్తున్నారని, విశాల్ ఆరోగ్యంగానే ఉన్నారని చిత్ర బృందం సభ్యులు పేర్కొన్నారు. శరవణన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.