కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విష్ణు విశాల్ హీరోగా రూపొందుతున్న డార్క్ యాక్షన్ థ్రిల్లర్ `ఎఫ్ఐఆర్`. ఈ చిత్రానికి మను ఆనంద్ దర్శకత్వం వహించారు. విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ పై విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం తమిళం, తెలుగులో ఏకకాలంలో విడుదల కానుంది. మాస్ మహారాజా రవితేజ సగర్వ సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మను ఆనంద్ తో ఇంటర్వ్యూ విశేషాలు.
ఎఫ్.ఐ.ఆర్. ఏ తరహా సినిమా?
యాక్షన్ థ్రిల్లర్ మూవీ. యంగ్ ముస్లిం టెర్రరిజంలో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత ఏమయింది అనేది కథ.
మీకు మొదటి సినిమా విష్ణు విశాల్ ను ఎలా ఒప్పించగలిగారు?
విష్ణు విశాల్ సినిమాలు నేను చూశాను. రాక్షసన్ సినిమాలో ఆయన నటన గమనించా. నా కథకు తగిన పాత్ర ఇతనే అని ఫిక్స్ అయ్యాను. ఇందులో ఆయన కేరెక్టర్‌లో రెండు షేడ్స్ వుంటాయి. ముందు విష్ణుకు డ్రెగ్ నేపథ్యంలో ఓ కథ చెప్పాను. అది భారీ సినిమా అవుతుందని మరో కథ చెప్పమన్నారు. అప్పుడు ఎఫ్.ఐ.ఆర్. చెప్పాను.
మీ నేపధ్యం గురించి చెప్పండి?
నేను గౌతమ్ వాసుదేవ్ మీనన్ దగ్గర 8 సంవత్సరాలు పనిచేశాను. సత్యదేవ్, అజిత్, ధనుష్ (తూటా) కుప పనిచేశాను.
ఇన్నేళ్ళ మీ జర్నీలో స్ట్రగుల్ పడిన సందర్భాలున్నాయా?
ముందు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరడమే చాలా కష్టమైంది. నాకు ఎటువంటి ఇండస్ట్రీ బేక్‌గ్రౌండ్ లేవు. నేను ఆస్ట్రేలియాలో మల్టీనేషనల్ కంపెనీలో పనిచేశాను. నాకు సినిమాపై ఇంట్రెస్ట్‌తో 2011లో ఇండియా వచ్చాను. చెన్నైలో దిగి నా ప్రయత్నాలు నేను చేసుకున్నా.
ఇంత స్ట్రగుల్ పడిన మీరు ఎఫ్.ఐ.ఆర్. వంటి సినిమా చేయడం రిస్క్ అనిపించలేదా?
రిస్క్ అనేది జీవితంలో ఓ భాగం ఏ రంగంలోనైనా వుంటుంది. నేను కార్పొరేట్ జాబ్ వదిలేస్తే ఫూలిష్ అన్నారు. ఆ తర్వాత నేను కొన్ని అడ్డంకులు అదిగమించాను. అయితే నేను ఎఫ్.ఐ.ఆర్.లో ఎటువంటి కాంట్రవర్సీని టచ్ చేయలేదు. ఒక ముస్లిం బాయ్ ప్రపంచాన్ని ఏ కోణంలో చూస్తాడు అనేది చూపించాను. ఇందులో ఏ మతానికి సంబంధించిన సినిమా కాదు. యాక్షన్, థ్రిల్లర్. హ్యూమన్ రిలేషన్స్, \డ్రామా కూడా వుంది. డైలాగ్స్ కూడా ఎవరినీ టార్గెట్ చేసినట్లు వుండవు.
దేశంలో లైఫ్ట్ రైట్ అనే గ్రూపులున్నాయి. ఇలాంటి టైంలో మీ సినిమా రావడం ఎలా అనిపిస్తుంది?
ఇది ఎవరినీ ఏ గ్రూప్‌ను దృష్టిలో పెట్టుకుని చేయలేదు. సినిమా చూశాక ప్రేక్షకుడే తీర్పు ఇస్తాడు. మేం సినిమాను అందరికోసం తీశాం. ఫలానా గ్రూప్‌కు అనుకూలంగా తీయలేదు. మనది సెక్యులర్ దేశం. ఫిలింలో కూడా అదే మేం చెబుతున్నాం.
సినిమా పూర్తయ్యాక విష్ణు విశాల్ ఎలా అనిపించాడు?
తను నిర్మాతగానే కాదు యాక్టర్‌గా ఫుల్ ఫ్లెడ్జ్ నటుడు. నేను ఈ కథ చెప్పగానే బాగా కనెక్ట్ అయ్యాడు. ఆయన దర్శకుడు నటుడు. తను ఛేజింగ్ సీన్స్‌లో పరిగెత్తడం, రైల్వే ట్రాక్ పక్కన కష్టపడి మరీ చేశాడు. ఆయనలో డెడికేషన్ బాగా నచ్చింది. నిర్మాతగా కూడా ఆయన ఫర్‌ఫెక్ట్.
ట్రైటర్ చూస్త కంప్లీట్ యాక్షన్ సినిమా. కానీ ముగ్గురు హీరోయిన్లకు స్పేస్ వుందా?
కథ ప్రకారమే పాత్రల ఎంపిక జరిగింది. ఇందులో భారీ తారాగణం వున్నారు. ఇందులో హీరో, విలన్, హీరోయిన్ అనేది లేదు. ముగ్గురు ఫిమేల్ పాత్రలున్నాయి. వారు కూడా కథకు కీలకం. నేను విష్ణుకు కథ చెప్పినప్పుడు 30 నిముషాలపాటు వారి పాత్రలే వుంటాయి. విష్ణు పెద్దగా కనిపించడు. రానురాను కథ లో టిస్ట్‌లు కనిపిస్తాయి.
కొత్తగా వచ్చిన మీరు మిగిలిన స్టార్ కాస్ట్‌ను తెలిసిన నటీనటుల్ని తీసుకుంటారు. మీ సినిమాలో అటువంటి వారు లేరు?
థియేటర్‌లో కూర్చునే ప్రేక్షకుడు పాత్రలో ట్రావెల్ అవ్వాలి. తెలిసిన ఫేస్‌లు వుంటే ప్రేక్షకులు కనెక్ట్ కాలేరు. అందుకే ఆడిషన్ చేసి నటీనటుల్ని ఎంపిక చేశాం.ఇందులో స్టేజీ ఆర్టిస్టులున్నారు. నేషనల్ అవార్డు విన్నర్‌లు వున్నారు.
రవితేజగారు మీ సినిమాలో ఎలా ప్రవేశించారు?
ఈ సినిమాకు చాలా మంచి విషయాలు జరిగాయి. కొత్త ఫేస్లతో సినిమా చేయడంతో తెలుగులో గ్రాండ్ లుక్ రావాలనుకున్నాం. విష్ణుకు నాని కూడా ఫ్రెండ్. అలాగే విష్ణు భార్య జ్వాలా గుప్తగారు రవితేజకు క్లోజ్ ఫ్రెండ్. అందుకే ఈ సినిమా పూర్తయ్యాక ఆరు నెలల క్రితం ట్రైలర్ చూపించారు. అది చూడగానే సినిమా చూస్తానన్నారు. చూశాక చాలా బాగుంది. నేను ఈ సినిమాకు హెల్ప్ చేస్తానని ముందుకు వచ్చారు.
ఒకేరోజు రవితేజగారి సినిమా మీ సినిమా విడులవుతుంది? ఎలా అనిపిస్తుంది?
రవితేజ ఖిలాడి అంచనాలతో వ స్తుంది. ఫ్యాన్స్ చూస్తారు. అలాగే రవితేజ సమర్పకులుగా వున్నారనే ఆసక్తితో మా సినిమానూ ప్రేక్షకులు, ఫ్యాన్స్ కూడా చూస్తారనే నమ్మకం వుంది.
యాక్షన్ సీన్స్ ఎలా వచ్చాయి?
స్టన్ శివ దీనికి యాక్షన్ చేశాను. గౌతమ్ సినిమాలకు ఆయనపనిచేశారు. ఆ పరిచయంతో అడిగాను. నేను యాక్షన్ సీన్స్ అనుకున్నాక ఆయన డిజైన్ చేసి అద్భుతంగా వచ్చేలా చేశారు.
సంగీతానికి ఎంత స్కోప్ వుంది?
ఇందులో ఐదు పాటలున్నారయి. ఇలాంటి కథకు ఇలా వుండడమే విశేషం. అది కూడా కథను రన్ చేస్తాయి. సాంగ్‌తోనే కథ ఆరంభమవుతుంది. మాస్ సాంగ్ కూడా వుంది. ఇక బేక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను అశ్వత్ ఇచ్చాడు. ఇది ప్రత్యేక ఆకర్షణగా వుంటుంది.
ఓటీటీలో ఆఫర్లు వచ్చాయా?
పెద్ద సంస్థలే ముందుకు వచ్చాయి. కానీ వారు దీనిని థియేటర్‌లో చూస్తేనే ఆ లుక్ వుంటుందని కూడా సలహా ఇచ్చారు. విజువల్‌గా ఇది గ్రాండియర్ గా వుంటుంది. అందుకే థియటేర్‌లో విడుదల చేస్తున్నాం.
మీ సినిమాను ఎందుకు చూడాలంటే ఏమి చెబుతారు?
తెలుగు ఆడియన్స్ సినిమా ప్రియులు. మంచి సినిమాలు ఆదరిస్తారు. కొత్తవారిని సపోర్ట్ చేస్తారు. బాహుబలి, \పుష్ప సినిమాలతోపాటు చాలా సినిమాలు ఆదరించారు. ఒకవేళ చూడకపోతే ఎక్కడ కరెక్షన్ అనేది తెలుసుకుంటాం.
మీకు నచ్చిన హీరో ఎవరు.
నేను పవన్ కళ్యాణ్ డైహార్ట్ ఫ్యాన్‌ను. ఆయన సినిమా తప్పకుండా చూస్తా. అలాగే మహేష్‌బాబు సినిమాలు చూస్తా. పుష్ప సినిమా కూడా చెన్నైలో తెలుగు వర్షన్ చూశా.
దర్శకులు ఎవరంటే ఇష్టం?
కొరటాల శివ. ఆయన దర్శకత్వం చాలా అంశాలు దాగి వుంటాయి. అలాగే బాహుబలి వంటి ఇంటర్నేషన్ సినిమా తీసిన దర్శకుడు కూడా ఇష్టం.