శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (08:31 IST)

నీ మతాన్ని ఆరాధించు.. పరమతాన్ని గౌరవించు : పవన్ కళ్యాణ్

మనం అనుసరిస్తున్న మతాన్ని ఆరాధించాలని, ఇతరులు అనుసరిస్తున్న మతాన్ని గౌరవించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన ముచ్చింతల్‌, శ్రీరామ నగరంలో జరుగుతున్న శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు ఆయన ఆదివారం హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించిన సమతామూర్తి శ్రీరామానుజ బంగారు విగ్రహాన్ని ఆయన సందర్శించారు. అలాగే, ఇక్కడ నిర్మించిన 108 దివ్యక్షేత్రాలను కూడా ఆయన దర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత చిన్నజీయర్ స్వామి ఆశీస్సులు కూడా అందుకున్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన మతాన్ని ఆరాధిస్తూనే పరమతాన్ని గౌరవించడం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని కోరారు. కాగా, పవన్ రాకతో శ్రీరామ నగరులో సందడి వాతావరణం నెలకొంది. ఆయనను చూసేందుకు, ప్రసంగం వినేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా పవన్‌కు చిన్నజీయర్ స్వామి శాలువా కప్పి సత్కరించారు. పవన్ వెంట జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ల భాస్కరరావు కూడా ఉన్నారు.