శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (23:16 IST)

కేబీఆర్ పార్క్ వద్ద 6 డబ్బాల గంజాయి.. ముగ్గురు అరెస్ట్

తెలంగాణలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు సర్కారు తీవ్రంగా చర్యలు చేపట్టింది. తాజాగా పోలీసులు రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. 
 
తాజాగా నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, కేబీఆర్ పార్క్ వద్ద 6 డబ్బాల గంజాయి ద్రావణాన్ని జూబ్లీ హిల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
 
కేబీఆర్ పార్క్ వద్దగంజాయి చేతులు మారుతోందనే పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి గంజాయి ద్రావణాన్నిపట్టుకున్నారు.