సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 ఆగస్టు 2021 (09:52 IST)

ఢిల్లీలో రూ.53 కోట్ల విలువ చేసే హెరాయిన్ స్వాధీనం

ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.53 కోట్ల విలువ చేసే హెరాయిన్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 8 కేజీల హెరాయిన్‌ను ఇద్దరు వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ హెరాయిన్‌ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో దాదాపు రూ.53కోట్ల విలువ ఉంటుందని అంచనా. అరెస్టయిన ఇద్దరూ టెహ్రాన్‌ నుంచి దుబాయి మీదుగా భారత్‌కు వచ్చారని, ఆఫ్ఘన్‌ జాతీయులని అధికారులు తెలిపారు. 
 
హెరాయిన్‌ను 30 కలర్‌ బాటిల్స్‌, రెండు షాంపూ బాటిళ్ల ద్వారా స్మగ్లింగ్‌ చేస్తుండగా పట్టుకున్నారు. ఇటీవలి కాలంలో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు గతేడాది డిసెంబర్‌ నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు రూ.600 కోట్లకుపైగా విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో 14 కేసుల్లో 18 మంది విదేశీయులు, ఇద్దరు భారతీయులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.