1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 31 జులై 2021 (08:51 IST)

యాదాద్రి వ్యభిచారానికి అడ్డానా? 131 గృహాలు సీజ్

తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాల్లో యాదాద్రి ఒకటి. ఈ ప్రదేశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరో తిరుమల క్షేత్రంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రచించారు. అదేసమయంలో ఒకపుడు యాదాద్రి వ్యభిచార కేంద్రానికి అడ్డాగా ఉండేది. దీనికి నిదర్శనం.. వ్యభిచారం గృహాల్లో 131 ఇళ్లను పోలీసులు సీజ్ చేశారు. 
 
ఇదే అంశంపై రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ మాట్లాడుతూ, యాదాద్రిలో వ్యభిచార ముఠాలు లేకుండా చేసినట్లు తెలిపారు. 34 మంది పిల్లలు, 36 మంది యువతులను రక్షించినట్లు చెప్పారు. పదేళ్ల కాలంలో వ్యభిచార ముఠాలను కట్టడి చేసినట్లు వెల్లడించారు. మళ్లీ వ్యభిచారాలు జరగకుండా నిరంతర నిఘా పెట్టామన్నారు. 
 
ముఖ్యంగా, వ్యభిచారానికి ఇచ్చే అద్దె ఇళ్లను సీజ్‌ చేశామన్నారు. మొత్తం 131 వ్యభిచార గృహాలను సీజ్‌ చేసినట్లు వెల్లడించారు. వ్యభిచార గృహాలు నడిపించేవాళ్లపై పీడీ యాక్ట్‌ నమోదు చేసినట్లు తెలిపారు. 
 
ఇప్పటికే 94 మందిపై పీడీ యాక్ట్‌ నమోదు చేశామన్నారు. వ్యభిచారం నిర్వహిస్తున్న 176 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. 400 మంది యువతులను, 36 మంది విదేశీ యువతులను రక్షించినట్లు సీపీ పేర్కొన్నారు.